యూజర్లకు ఆర్బీఐ షాక్..క్రెడిట్ కార్డుతో రెంట్ పేమెంట్ కట్
భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఊహించని ట్విస్ట్ వచ్చింది.
By - Knakam Karthik |
ఢిల్లీ: భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఊహించని ట్విస్ట్ వచ్చింది. క్రెడిట్ కార్డు వినియోగదారులు అంతా ఎక్కువగా వాడే ఆప్షన్ ని ఇకపై రద్దు చేసేలా కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై క్రెడిట్ కార్డుల ద్వారా జరిగే రెంట్ పేమెంట్ సేవలు నిలిచిపోనున్నాయి. దీంతో, ఫోన్‌పే, పేటీఎం, క్రెడ్ వంటి ప్రముఖ సంస్థలు ఈ ఆప్షన్ ను తమ యాప్ నుంచి తొలగించేశాయి. నిజానికి, ఈ సేవలను చాలామంది అత్య వసరాలకు ఉపయోగించుకున్నారు. కానీ కొందరు దీనిని దుర్వినియోగం చేస్తూ అక్రమ లావాదేవీలకు పాల్పడుతున్నారని బ్యాంకులు, ఆర్బీఐ గుర్తించాయి.
ఈ సమస్యకు అడ్డుకట్ట వేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొన్ని బ్యాంకులు హెచ్‌డీఎఫ్సీ, ఐసీఐసీఐ వంటివి అద్దె చెల్లింపులపై 1 శాతం ఫీజును వసూలు చేస్తున్నాయి. రివార్డు పాయింట్లు నిలిపివేయడం వంటి కఠిన చర్యలు తీసుకున్నాయి. చివరికి ఈ సేవలను నిలిపివేయడం గమనార్హం. అవసరానికి వాడుకుంటున్న వారి ఆశలపై నీళు చల్లినట్లు అయింది. ఇక ఇప్పుడు నగదు అవసరాల కోసం దారులను వెతుక్కోక తప్పదు.