ప్రముఖ పెట్టుబడిదారుడు, బిగ్‌బుల్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా ఇటీవలే మరణించారు. ఆయన పెట్టుబడుల నిర్వహణ, ట్రస్ట్‌ను ఝన్‌ఝన్‌వాలా మిత్రుడు, డీమార్ట్ వ్యవస్థాపకుడు రాధాకిషన్ దమానీ చూసుకోనున్నారు. ఇకపై ఆయన ఝున్‌ఝున్‌వాలా ఎస్టేట్‌కు ప్రధాన ట్రస్టీగా వ్యవహరిస్తారు. ఝున్‌ఝున్‌వాలా ప్రస్తుత పెట్టుబడులపై దమానీనే తుది నిర్ణయం తీసుకుంటారు. కల్‌ప్రజ్ ధరంషి, అమల్ పారిఖ్ ఇతర ట్రస్టీలుగా ఉంటారు. ఝున్‌ఝున్‌వాలా.. తన గురువు ఆర్‌కె దమానీని ఎపుడూ ప్రశంసిస్తూ ఉండేవారు.
తన తండ్రి, టాటాస్, విన్‌స్టన్ చర్చిల్, జార్జ్ సోరోస్, రాధాకిషన్ దమానీ ఈ ఐదుగురు తనకు రోల్ మోడల్స్ అనీ, వారినుంచి స్ఫూర్తి పొందానని పలు ఇంటర్వ్యూలలో ఝున్‌ఝున్‌వాలా గుర్తుచేసుకునేవారు. ఝున్‌ఝున్‌వాలా సన్నిహిత వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం..గత ఎనిమిది నెలలుగా అనారోగ్యంతో బాధ పడుతున్నందున ప్రతీ విషయంలోనూ ఆయనకు క్లారిటీ ఉందట..! ఆగస్ట్ 14న మరణించిన రాకేష్ ఝున్‌ఝున్‌వాలా లిస్టెడ్ , అన్‌లిస్టెడ్ సంస్థలలో పెట్టుబడులతో సహా కోట్లాది రూపాయల ఆస్తులను అతని భార్య, ముగ్గురు పిల్లలకు వదిలి వెళ్లారు.