పరుగులు పెడుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు
Petrol and Diesel price on July 5th.దేశంలో ఇంధన ధరలు పరుగులు పెడుతున్నాయి. గత కొద్ది రోజులు
By తోట వంశీ కుమార్ Published on 5 July 2021 4:32 AM GMTదేశంలో ఇంధన ధరలు పరుగులు పెడుతున్నాయి. గత కొద్ది రోజులు ధరలను క్రమం తప్పకుండా పెంచుతున్నాయి చమురు కంపెనీలు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ధరలు సెంచరీని దాటేసింది. దేశ రాజధాని ఢిల్లీలో వందకు చేరువలో ఉంది. తాజాగా పెట్రోల్, డీజిల్‌పై 31 నుంచి 39 పైసల వరకు పెరిగింది. దీంతో వాహనదారులు తమ వాహనాలకు బయటకు తీయాలంటేనే భయపడుతున్నారు.
ప్రధాన నగరాల్లో ధరలు ఇలా..
- ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 99.90, డీజిల్ రూ. 89.40
- ముంబయిలో పెట్రోల్ రూ. 105.62, డీజిల్ రూ. 96.95
- కోల్‌కతాలో పెట్రోల్ రూ.99.84, డీజిల్ రూ.92.27,
- చెన్నైలో పెట్రోల్ రూ. 100.78, డీజిల్ రూ. 93.94
- బెంగళూరులో పెట్రోల్ రూ. 103.84, డీజిల్ రూ. 94.72
- హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ. 103.78, డీజిల్ రూ. 97.40
- విజయవాడలో పెట్రోల్ ధర రూ.106.26, డీజిల్ ధర రూ. 99.27
ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, ఫునేలోని మెట్రో నగరాల్లో లీటర్ పెట్రోల్ ధర 100 మార్క్ దాటింది. అయితే వ్యాట్, సరుకు రవాణా ఛార్జీలు వంటి స్థానిక పన్నులను బట్టి ఇంధన ధరలు మారుతుంటాయి. ఇక దేశంలోని పెట్రోల్, డీజిల్‌పై రాజస్థాన్ అత్యధిక వ్యాట్ వసూలు చేస్తోంది. దీని తర్వాత మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలున్నాయి.