మరోసారి పెరిగిన ఇంధ‌న ధ‌ర‌లు.. హైద‌రాబాద్‌లో రూ.100కు చేరువ‌గా పెట్రోల్‌

Petrol and diesel price hiked again today. తాజాగా పెట్రోల్‌ లీటర్‌కు 23 పైసలు, డీజిల్‌ లీటర్‌కు 27 పైసల వరకూ పెంచాయి. హైద‌రాబాద్‌లో రూ.100కు చేరువ‌గా పెట్రోల్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 May 2021 9:28 AM IST
Petrol Diesel Prices Hike again

ఉద‌యం 6 అయితే చాలు సామాన్యుల గుండె గుబేల్ మంటుంది. రోజువారీ స‌మీక్ష‌లో భాగంగా ప్ర‌తిరోజు ఉద‌యం 6 గంట‌ల‌కు దేశీయ చ‌మురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధ‌ర‌ల‌ను స‌వ‌రిస్తూ ఉంటాయి. అయితే చ‌మురు ఉత్ప‌త్తుల‌పై ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ప‌న్నులు వ‌సూలు చేస్తుండ‌టంతో పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల్లో ఎక్కువ త‌క్కువ‌లు ఉంటాయి. క‌రోనా కష్ట‌కాలంలో ఓ వైపు మందులు, మ‌రో వైపు నిత్యావ‌స‌రాల ధ‌ర‌లు పెరిగి సామాన్యులు అవ‌స్థలు ప‌డుతుంగా.. ఇంధ‌న‌లు ధ‌ర‌లు నిత్యం పెరుగుతుండ‌డంతో సామాన్యులు జేబు గుల్ల‌వుతోంది.

ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాల వెలువ‌డిన అనంత‌రం ఇంధ‌న బాదుడు మొద‌లైంది. నేడు కూడా ఇంధ‌న ధ‌ర‌లు పెంచుతూ చ‌మురు కంపెనీలు నిర్ణ‌యం తీసుకున్నాయి. తాజాగా పెట్రోల్‌ లీటర్‌కు 23 పైసలు, డీజిల్‌ లీటర్‌కు 27 పైసల వరకూ పెంచాయి. పెంచిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.93.44, డీజిల్‌ లీటర్ రూ.84.32కు చేరింది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో ఇంధ‌న ధ‌ర‌లు ఇలా..

ఢిల్లీలో పెట్రోల్‌ ధర రూ.93.44, డీజిల్‌ రూ.84.32

ముంబైలో పెట్రోల్‌ రూ.99.71, డీజిల్‌ రూ.91.57

కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.93.49, డీజిల్‌ రూ.87.16

చెన్నైలో పెట్రోల్‌ రూ.93.49, డీజిల్‌ 87,16

హైదరాబాద్‌లో పెట్రోల్‌ రూ.97.12, డీజిల్‌ రూ.91.92

ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో పెట్రోల్‌ ధర రూ.100 దాటింది. మే నెలలో ఇప్పటి వరకు 13 సార్లు ఇంధన ధరలు పెరిగాయి. ఇప్పటి వరకు పెట్రోల్‌పై దాదాపు రూ.2.80, డీజిల్‌పై రూ.3పైగా పెంచాయి. పెట్రోల్ రిటైల్ అమ్మకపు ధరలో 60 శాతం, డీజిల్‌లో 54 శాతానికి పైగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు విధిస్తుండగా.. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌పై లీటరుకు రూ.32.90, డీజిల్‌పై రూ .11.80 వసూలు చేస్తోంది.


Next Story