పర్సనల్ లోన్ ముందుగానే క్లోజ్ చేయాల‌నుకుంటున్నారా.? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి..!

అన్ని రుణాలలో క‌ల్లా ప‌ర్స‌న‌ల్ లోన్‌ పొందడం చాలా సులభమైనదిగా చెబుతారు.

By Medi Samrat
Published on : 24 March 2025 10:11 AM IST

పర్సనల్ లోన్ ముందుగానే క్లోజ్ చేయాల‌నుకుంటున్నారా.? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి..!

అన్ని రుణాలలో క‌ల్లా ప‌ర్స‌న‌ల్ లోన్‌ పొందడం చాలా సులభమైనదిగా చెబుతారు. ఈ ద్రవ్యోల్బణం యుగంలో చాలా మంది ప్రజలు తమకు ఇష్టమైన వస్తువులను కొనుగోలు చేయడానికి.. త‌మ అవ‌స‌రాల‌ను తీర్చుకోవ‌డానికి ఈ ప‌ర్స‌న‌ల్ లోన్‌ను ఆశ్రయిస్తున్నారు. ప‌ర్స‌న‌ల్ లోన్‌లో మ‌నం అసలు మొత్తంతో పాటు వడ్డీని చెల్లించాలి.

ప్రతి ఒక్కరూ తమ రుణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలనుకుంటారు. కానీ మీరు గడువుకు ముందే రుణాన్ని చెల్లిస్తే.. మీరు ముందస్తు మూసివేత(ఫ్రీ-క్లోజ‌ర్‌)ను ఎదుర్కోవలసి ఉంటుంది. దాని ప్రయోజనాలు, అప్రయోజనాలు అర్థం చేసుకునే ముందు.. ప్రీ-క్లోజర్ అంటే ఏమిటో తెలుసుకుందాం.

గడువు తేదీకి ముందు మన మొత్తం రుణాన్ని తిరిగి చెల్లిస్తే ప్రీ-క్లోజర్ అంటారు. రుణాన్ని తిరిగి చెల్లించడానికి తగినంత నిధులు ఉన్నప్పుడే ఇది మంచిది. ప్రీ-క్లోజర్ మీ వడ్డీ రేటును తగ్గిస్తుంది. ఎందుకంటే ఎంత ఎక్కువ రుణం తీసుకుంటే అంత వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ప్రీ-క్లోజర్ వ‌ల్ల‌ మ‌న‌ క్రెడిట్ స్కోర్ ఇంప్రూవ్ అవుద్ది.. ఇది భవిష్యత్తులో మ‌నం లోన్‌ పొందేందుకు సులభతరం అవుతుంది.

ప్రీ-క్లోజర్ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు..

ప్రీ-క్లోజర్ ద్వారా లోన్‌పై వడ్డీ రేటు తగ్గుతుంది.

మ‌నం గడువుకు ముందే రుణాన్ని తిరిగి చెల్లిస్తాం కాబట్టి, ఇది మ‌న‌ క్రెడిట్ స్కోర్‌ను బలపరుస్తుంది.

మ‌న‌కు మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే, భవిష్యత్తులో సులభంగా రుణం పొందే అవకాశాలు కూడా పెరుగుతాయి.

లోన్ క్లోజ్ చేయ‌డం వ‌ల్ల‌ EMI భారం తగ్గుతుంది. దానివల్ల ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.

ప్రీ-క్లోజర్ వ‌ల్ల‌ ప్రతికూలతలు

ప్రీ-క్లోజర్ యొక్క ప్రయోజనాలతో పాటు దీనికి కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి.

కొన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ప్రీ-క్లోజర్ తీసుకున్నందుకు 2 నుండి 6 శాతం వరకు రుసుము వసూలు చేస్తాయి.

దీని కారణంగా వడ్డీ, EMI పూర్తయిన తర్వాత పొందే ప్రయోజనం తగ్గుతుంది.

మ‌న‌ వద్ద తగినన్ని నిధులు లేకుంటే.. ప్రీ-క్లోజర్ వెళ్లకూడ‌దు. అలా వెళ్ల‌డ ద్వారా భవిష్యత్తులో అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడంలో ఇబ్బంది ఉండవచ్చు.

పర్సనల్ లోన్‌లో మరేదైనా లోన్‌లో అయినా ప్రీ-క్లోజర్ ఆప్షన్ తీసుకోవాలా లేదా అనేది కొన్ని విషయాలపై ఆధారపడి ఉంటుంది. ముందుగా అత్యవసరం కోసం దాచుకున్న‌ నిధి నుండి ప్రీ-క్లోజర్‌ని చెల్లించవద్దు. దీనితో పాటు.. ముందుగా రుణాన్ని తిరిగి చెల్లించిన తర్వాత కూడా మ‌న‌ ఆర్థిక పరిస్థితి బాగా ఉండేలా చూసుకోవాలి.

అలాగే ప్రీ-క్లోజర్ ఛార్జీలను కూడా తనిఖీ చేయాలి. వీటన్నింటిని సరిగ్గా మూల్యాంకనం చేసిన తర్వాతే ప్రీ-క్లోజ్ నిర్ణయం తీసుకోవాలి. మనం రుణం తీసుకునే ముందు బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుండి ప్రీ-క్లోజర్ ఛార్జీల గురించి సమాచారాన్ని కూడా పొందవచ్చు.

Next Story