పేటీఎం ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ భావోద్వేగం.. 'భారత భాగ్య విధాత' అని చెప్పినప్పుడల్లా పొంగిపోతుంటా..

Paytm listed on the stock market .. Founder Vijay Shekhar Sharma Emotion. డిజిటల్‌ పేమెంట్స్‌ మార్కెట్‌లో అతి తక్కువ సమయంలోనే మెజారిటీ వాటాను సొంతం చేసుకుంది పేటీఎం. తాజాగా స్టాక్‌ మార్కెట్‌లో చరిత్ర సృష్టించింది.

By అంజి  Published on  18 Nov 2021 10:05 AM GMT
పేటీఎం ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ భావోద్వేగం.. భారత భాగ్య విధాత అని చెప్పినప్పుడల్లా పొంగిపోతుంటా..

డిజిటల్‌ పేమెంట్స్‌ మార్కెట్‌లో అతి తక్కువ సమయంలోనే మెజారిటీ వాటాను సొంతం చేసుకుంది పేటీఎం. తాజాగా స్టాక్‌ మార్కెట్‌లో చరిత్ర సృష్టించింది. సాధారణంగా ప్రారంభమైన పేటీఎం.. ఇప్పుడు ఐపీవో స్థాయికి ఎదిగి.. అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌లో పేటీఎం ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫరింగ్‌ లిస్ట్‌ అయ్యింది. ఇది రూ.18,300 కోట్ల ఐపీవో. భారత దేశ చరిత్రలో ఇంత పెద్ద ఐపీవో లిస్ట్‌ కావడం ఇదే మొదటి సారి. పేటీఎం లిస్టింగ్‌ అవుతున్న సమయంలో ఫౌండర్‌, సీఈవో విజయ్‌ శేఖర్‌ శర్మ భావోద్వేగానికి గురయ్యారు. తాను కన్నీళ్లతో ఉన్నానని, తాను 'భారత భాగ్య విధాత' అని అన్నప్పుడల్లా పొంగిపోతుంటాని భావోద్వేగం చెందారు. ఇది ఎవరూ ఊహించని రోజని, ఇక్కడి దాకా వస్తామని మనలో చాలా మంది నమ్మలేదని అన్నారు. పేటీఎం బోర్డు మెంబర్స్‌, షేర్‌ హోల్డర్స్‌ చాలా అదృష్టవంతులని విజయ్‌ శేఖర్ శర్మ పేర్కొన్నారు.

వన్‌97 కమ్యూనికేషన్‌ పేటీఎం యొక్క మాతృసంస్థ. దీనిని 2000 సంవత్సరంలో విజయ్‌శేఖర్‌ శర్మ స్థాపించారు. మొదట్లో దీనితో టెలికామ్‌ ఆపరేటర్లకు కంటెంట్‌ అందించే వారు.. 2010లో పేటీఎంగా మారింది. ఆ తర్వాత నెమ్మదిగా ఆన్‌లైన్‌ పేమెంట్స్‌ రంగంలోకి అడుగుపెట్టింది. 2014లో వాలెట్‌ పేమెంట్స్‌ లైసెన్స్‌ పొందిన పేటీఎం.. ఆ తర్వాత 2015లో చైనాకు చెందిన యాంట్‌ గ్రూప్‌ పెట్టుబడులతో సంస్థ రూపు రేఖలే మారిపోయాయి. అనంతరం మారుమూల ప్రాంతాలకు సైతం పేటీఎం సేవలు విస్తరించాయి. 2016 సంవత్సరంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం పాత నోట్లను రద్దు చేయడంతో పేటీఎం డిజిటల్‌ పేమెంట్స్‌ విపరీతంగా పెరిగిపోయాయి. అలా తక్కువ సమయంలోనే యువ బిలియనీర్స్‌ లిస్ట్‌లో విజయ్‌ శేఖర్‌ చోటు సంపాదించుకున్నారు. దాదాపు ఆయన సంపద విలువ రూ.18 వేల కోట్లు. విజయశేఖర్‌ కుటుంబంలో ఎలాంటి వ్యాపార నేపథ్యం, భారీ నగదు లేదు. ముఖ్యంగా ఆయనకు ఇంగ్లీష్‌ భాషపై పట్టు కూడా లేదు.


Next Story