వార్షికోత్సవ వేడుకల సందర్భంగా ప్రత్యేక ఆఫర్లతో 'ఓరా'
ORRA announces mega Anniversary sale with exciting offers. భారతదేశపు సుప్రసిద్ధ వజ్రాభరణాల బ్రాండ్ 'ఓరా'.. వార్షికోత్సవ వేడుకలను ప్రత్యేక ఆఫర్లతో నిర్వహిస్తోంది.
By Medi Samrat Published on 9 April 2022 4:40 PM ISTభారతదేశపు సుప్రసిద్ధ వజ్రాభరణాల బ్రాండ్ 'ఓరా'.. వార్షికోత్సవ వేడుకలను ప్రత్యేక ఆఫర్లతో నిర్వహిస్తోంది. దేశ వ్యాప్తంగా అన్ని ఓరా స్టోర్లు, వెబ్‌సైట్‌పై ఈ ఆఫర్ లు లభ్యమవుతాయి. ఈ నేఫథ్యంలో ఒరా విస్తృతశ్రేణి జ్యువెలరీ డిజైన్లను తీర్చిదిద్దింది. ఇవి అసాధారణ పనితనంతో కాలాతీత ఆభరణాలుగా నిలుస్తాయి. ఎక్కువ డిజైన్ల ఆభరణాలతో పాటుగా మెగా ఆఫర్లు ఉండటం వల్ల వినియోగదారులు తమ వైవిధ్యమైన అభిరుచులు, సందర్భాలకు అనుగుణంగా ఆభరణాలను పొందవచ్చు. అతి సున్నితంగా తీర్చిదిద్దిన ఇయర్ రింగ్స్ నుంచి ఆస్ట్రా శ్రేణి అసాధారణ మైన్పటికీ అందుబాట ధరల్లోని వజ్రాల నెక్లెస్‌లు, ఇయర్ రింగ్స్ తో ఓరా స్ధిరంగా నూతన డిజైన్లను పరిచయం చేయడంతో పాటుగా మారుతున్న వినియోగదారుల డిమాండ్స్‌ను తీర్చే ప్రయత్నం చేస్తుంది.
· వజ్రాభరణాలపై 25% రాయితీ , ఈఎంఐపై 0% వడ్డీ. ఈ సదుపాయం అందిస్తున్న ఒకే ఒక్క ఆభరణాల బ్రాండ్
· అక్షయ తృతీయ, గుడి పడ్వా సందర్భంగా ఈ బ్రాండ్ తమ ప్రత్యేకమైన నెక్లెస్ సెట్‌ను 69,999 రూపాయల ధరలో విడుదల చేసింది. 14 కెరట్‌ల ఎల్లో గోల్డ్ నెక్లెస్‌లను రెడ్, గ్రీన్ కలర్ రాళ్లలో తీర్చిదిద్దింది.
ఈ సందర్భంగా ఓరా ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ దీపు మెహతా మాట్లాడుతూ ''వార్షికోత్సవ అమ్మకాలను వేడుక చేస్తూ ఈ ఆఫర్లను ప్రకటించడం పట్ల సంతోషంగా ఉన్నాము. సమృద్ధితో కూడిన షాపింగ్ అనుభవాలను మా వినియోగదారులకు అందించడంతో పాటుగా వారి కొనుగోళ్లకు అత్యుత్తమ విలువను అందిస్తున్నాం. అక్షయ తృతీయ, గుడి పడ్వా వంటి పండుగలు శుభారంభాన్ని సూచిస్తాయి. మా వినియోగదారులు మా ఓరా స్టోర్లు అన్నింటిలోనూ గొప్ప ఆఫర్లు, అదనపు ప్రయోజనాల కోసం ఎదురుచూడవచ్చు'' అని అన్నారు. ఈ ఆఫర్లు 25 మార్చి 2022 నుంచి 07 మే 2022 వరకూ భారతదేశ వ్యాప్తంగా ఓరా రిటైల్ స్టోర్లు మరియు ఆన్‌లైన్‌లో https://www.orra.co.in వద్ద లభ్యమవుతాయి.