కస్టమర్లకు మెక్‌డొనాల్డ్స్ గుడ్‌న్యూస్.. వాట్సాప్ నుంచి కూడా..
Order your favourite treat using WhatsApp. మెక్‌డొనాల్డ్స్ కస్టమర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఇప్పటి వరకూ కేవలం
By Medi Samrat Published on
23 Dec 2020 9:46 AM GMT

మెక్‌డొనాల్డ్స్ కస్టమర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఇప్పటి వరకూ కేవలం యాప్ ద్వారా మాత్రమే పుడ్ ఆర్డర్ చేసే అవకాశం కల్పించిన మెక్‌డొనాల్డ్స్.. ఇకనుండి ఆర్డర్లను వాట్సాప్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చనే గుడ్‌న్యూస్ తెలిపింది. మెక్‌డొనాల్డ్స్ ఇండియా మంగళవారం నుంచి ఈ సౌకర్యాన్ని కల్పించింది.
వాట్సాప్ ద్వారా మీరు ఏదైనా ఆర్డర్ చేయాలని అనుకుంటే.. 'Hi' అని టైప్ చేసి మెక్‌డొనాల్డ్స్ ఇండియా వాట్సాప్ నంబర్ అయిన 9953916666కు పంపండి. ఆ తర్వాత మీకు ఓ మెను లింక్ వస్తుంది. అందులో నుంచి మీకు నచ్చిన పుడ్‌ను ఆర్డర్ చేసుకోవచ్చు. మీ వాట్సాప్ నంబర్, డెలివరీ అడ్రెస్ లాంటి వివరాలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఒకసారి ఆర్డర్ పూర్తయిన తర్వాత వాటి వివరాలతోపాటు ఇన్వాయిస్ కూడా మీ నంబర్‌కు పంపిస్తారు.
అయితే.. ప్రస్తుతానికి ఈ ఆఫర్ కేవలం ఢిల్లీ ఎన్‌సీఆర్ పరిధిలోని మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్లకు మాత్రమే అందుబాటులో ఉంది. మిగతా నగరాల్లోని కస్టమర్లు దీని కోసం మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
Next Story