భయపెడుతున్న వన్ ప్లస్ మొబైల్స్.. పేలిందంటూ మూడో ఫిర్యాదు

OnePlus Nord 2 5G Allegedly Explodes Causing Severe Burns. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ వన్‌ప్లస్ నుండి OnePlus Nord 2 ఈ సంవత్సరం జూలైలో విడుదలైంది

By Medi Samrat  Published on  9 Nov 2021 6:02 PM IST
భయపెడుతున్న వన్ ప్లస్ మొబైల్స్.. పేలిందంటూ మూడో ఫిర్యాదు

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ వన్‌ప్లస్ నుండి OnePlus Nord 2 ఈ సంవత్సరం జూలైలో విడుదలైంది. అయితే ఈ మోడల్ మొబైల్ ఫోన్స్ వినియోగదారులను భయపెడుతూ ఉన్నాయి. నాలుగు నెలల్లో ఈ మోడల్‌కి సంబంధించి 3 ఫోన్లు పేలిపోయాయి. తాజాగా సుచిత్‌ అనే వ్యక్తి ఈ ఫోన్ పేలిన కారణంగా గాయపడ్డాడనే పోస్టు వైరల్ అవుతోంది. ఫోన్ పేలిన తర్వాత సుచిత్ శర్మ కొన్ని ఫోటోలను షేర్ చేశారు. ఈ ఫోటోలలో పాడైన ఫోన్‌తో పాటు కాలిన గాయాలను కూడా చూపే ప్రయత్నం చేశాడు. వన్‌ప్లస్ వినియోగదారులు వన్‌ప్లస్ ఇండియాను ట్యాగ్ చేసి మీ కంపెనీ నుంచి దీనిని ఊహించలేదని రాశారు. ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న వన్‌ప్లస్‌ ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామని వినియోగదారుని సంప్రదిస్తామని తెలిపింది. అతడికి తగిన న్యాయం చేయడానికి సిద్దంగా ఉన్నామని తెలిపింది.

OnePlus Nord 2 5G జూలైలో కంపెనీ యొక్క ప్రముఖ మిడ్-రేంజ్ మోడల్ OnePlus Nordకి తర్వాతి మొబైల్ గా పేరుతెచ్చుకుంది. ప్రారంభించిన మూడు నెలల వ్యవధిలో కొత్త OnePlus ఫోన్స్ ఇప్పటికే రెండు సార్లు పేలింది. ఒక సందర్భంలో, OnePlus తన OnePlus Nord 2 5G ఫోన్ పేలిపోయిందని ఆరోపించిన వినియోగదారుడికి చట్టపరమైన నోటీసులు కూడా పంపింది. ఫోన్‌తో పాటు, OnePlus Nord 2 5G ఛార్జర్ కూడా ఇటీవల పేలింది. అయితే ఆ విషయంలో కంపెనీ వేరే కారణాలను నిందించింది. OnePlus పేలుడు మొదటి సంఘటన ఆగస్టు 1, 2021 న వెలుగులోకి వచ్చింది. ఇందులో సోషల్ మీడియా వినియోగదారు అంకుర్ శర్మ తన భార్య సైక్లింగ్ చేస్తున్నప్పుడు ఈ పోన్‌ పేలిపోయిందని చెప్పారు.

అతను సోషల్ మీడియాలో పేలుడు ఫోటోను కూడా షేర్ చేశాడు. సెప్టెంబర్ 8, 2021న ఢిల్లీలో రెండో కేసు వెలుగులోకి వచ్చింది. ఢిల్లీకి చెందిన న్యాయవాది గౌరవ్ గులాటీ స్మార్ట్‌ఫోన్ పేలుడుకు సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. సెప్టెంబరు 8న తన కార్యాలయంలో (కోర్ట్ ఛాంబర్) కూర్చున్నానని తన జేబులో వేడిని గమనించి ఫోన్‌ను బయటకు తీయగానే అందులో నుంచి పొగలు వచ్చాయని చెప్పారు. OnePlus Nord 2 పేలుడు గురించిన తాజా సంఘటన OnePlus Nord 2 Pac-Mac ఎడిషన్ లాంచ్ చేయడానికి కొద్ది రోజుల ముందు వచ్చింది. కొత్త ఫోన్ కు సంబంధించి అమెజాన్‌లో టీజర్ ను కూడా వదిలారు.



Next Story