మరోసారి పెరిగిన పెట్రోల్-డీజిల్ ధరలు

Once Again Fuel Price Hike. భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. వారం క్రితం లీటర్ పెట్రోల్ పై

By Medi Samrat  Published on  30 May 2022 5:54 AM GMT
మరోసారి పెరిగిన పెట్రోల్-డీజిల్ ధరలు

భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. వారం క్రితం లీటర్ పెట్రోల్ పై రూ. 8, డీజిల్ పై రూ. 6 సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం తగ్గించడం కాస్త ఊరటనిచ్చినా.. ఇంతలోనే పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరగడం ప్రారంభించాయి. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ పై 17 పైసలు, డీజిల్ పై 16 పైసలు పెంచారు. దీంతో నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 109.83కి చేరుకుంది. డీజిల్ ధర రూ. 97.98కి పెరిగింది. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 111.92గా, డీజిల్ ధర రూ. 99.65గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 0.84 శాతం పెరుగుదలతో బ్యారెల్‌కు 116.54 డాలర్లకు చేరింది. డబ్ల్యూటీఐ క్రూడ్ రేటు 0.83 శాతం పెరిగి, బ్యారెల్‌కు 116.05 డాలర్లుగా ఉంది.

విజయవాడలో పెట్రోల్ ధర 11పైసలు తగ్గి లీటరు రూ. 111.92 గా ఉంది. డీజిల్ ధర 9పైసలు తగ్గి లీటరు రూ.99.65 గా ఉంది. విశాఖపట్నంలో మాత్రం పెట్రోల్ రేటు 30 పైసలు పెరిగి లీటరు రూ.110.78 గా ఉంది. డీజిల్ కూడా 28 పైసలు పెరిగి లీటరు రూ. 98.55గా ఉంది.దేశరాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72గా, డీజిల్ రూ.89.62గా ఉంది. గురుగ్రామ్‌లో పెట్రోల్ రూ.97.81, డీజిల్ రూ.90.05గా ఉంది. ముంబైలో పెట్రోల్ రూ.111.35, డీజిల్ రూ.97.28గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర లీటరుకు రూ.102.65కాగా, డీజిల్ లీటరు రూ.94.24గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ రూ.106.03, డీజిల్ రూ.92.76గా ఉంది. బెంగళూరులో పెట్రోల్ రూ.101.94, డీజిల్ రూ.87.89గా ఉంది.


Next Story