ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ తన ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ 'రోడ్‌స్టర్ ఎక్స్+ 9.1 కిలోవాట్ (Roadster X+ 9.1 kWh)' ధరను ఏకంగా రూ. 60,000 తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఓలా స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన 4680 భారత్ సెల్ (Bharat Cell) తో నడిచే ఈ బైక్ గతంలో రూ. 1,89,999 కి లభించగా, తాజా తగ్గింపుతో ఇప్పుడు రూ. 1,29,999 కే అందుబాటులో ఉండనుంది.
ఓలా రోడ్‌స్టర్ X+ 9.1 లోని 9.1 kWh బ్యాటరీ ప్యాక్‌ను ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే దాదాపు 501 కి.మీ. (IDC క్లెయిమ్డ్) రేంజ్ వస్తుందని కంపెనీ చెబుతోంది. సగటు విద్యుత్ యూనిట్ ధరను రూ. 5 గా పరిగణనలోకి తీసుకుంటే, ఈ మోటార్‌సైకిల్‌ను పూర్తి ఛార్జ్ చేయడానికి అయ్యే ఖర్చు కేవలం రూ. 46 మాత్రమే. అంటే కిలోమీటరుకు దీని రన్నింగ్ కాస్ట్ అత్యద్భుతంగా 9 పైసలు మాత్రమే పడుతుంది. ఓలా బైక్ కొన్నందుకు అదనంగా పెట్టిన పెట్టుబడిని ఈ రన్నింగ్ కాస్ట్ ఆదా చేయడం ద్వారా తిరిగి పొందడానికి దాదాపు 6 లక్షల కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తుంది.