డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో సాంకేతిక మార్గదర్శకుడు మరియు నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) , అటల్ పెన్షన్ యోజన (APY) కోసం భారతదేశంలో అతిపెద్ద సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీ (CRA) అయిన ప్రోటీన్ eGov టెక్నాలజీస్ (గతంలో NSDL e-Gov) తమ పెన్షన్ నిర్వహణ యాప్("NPS by Protean")ను విస్తరించింది, నేటి డిజిటల్ అవగాహన ఉన్న తరం కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన అనేక కొత్త ఫీచర్లతో ‘ NPS బై ప్రోటీన్' ను అప్డేట్ చేసింది.
మీరు ఇప్పటికే NPS పెట్టుబడిదారు అయినా లేదా NPSతో మీ పదవీ విరమణ ప్రణాళిక ప్రయాణాన్ని ప్రారంభించినా.. ఈ యాప్ ఏకీకృత పరిష్కారంగా నిలుస్తుంది. ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ వినియోగదారులకు అందుబాటులో ఉన్న ఈ యాప్, సహజమైన నావిగేషన్ మరియు మెరుగైన భద్రతా లక్షణాలను అందిస్తుంది. మీ NPS ఖాతాలను నమోదు చేసుకోవడం, సహకరించడం మరియు నిర్వహించడం గతంలో కంటే సులభతరం చేస్తుంది.
ఈ సందర్భంగా, ప్రోటీన్ eGov టెక్నాలజీస్ ఎండి & సీఈఓ సురేష్ సేథి మాట్లాడుతూ, “ NPS మరియు APY కోసం ప్రముఖ సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీ (CRA)గా, మార్కెట్ విస్తరణకు ఇది ఒక గొప్ప అవకాశంగా మేము భావిస్తున్నాము. భారతదేశ యువత వైవిధ్యభరితమైన పెట్టుబడి ఎంపికల గురించి మరింత తెలుసుకుని, వారి పదవీ విరమణను చురుకుగా ప్లాన్ చేసుకోవడం ప్రారంభించినందున మా కొత్త యాప్ యొక్క మెరుగైన వెర్షన్ సరైన సమయంలో వచ్చింది..” అని అన్నారు.