నథింగ్ ఫోన్‌ (3a) సిరీస్‌ – మేడ్‌ ఇన్ ఇండియా

లండన్‌ కేంద్రంగా ఉన్న నథింగ్‌ సంస్థ భారత్‌లో తయారు చేసిన తన సరికొత్త సృజనాత్మక స్మార్ట్‌ఫోన్‌ నథింగ్‌ ఫోన్‌ 3(a) సిరీస్‌ను ప్రకటించింది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  11 Feb 2025 4:30 PM IST
నథింగ్ ఫోన్‌ (3a) సిరీస్‌ – మేడ్‌ ఇన్ ఇండియా

లండన్‌ కేంద్రంగా ఉన్న నథింగ్‌ సంస్థ భారత్‌లో తయారు చేసిన తన సరికొత్త సృజనాత్మక స్మార్ట్‌ఫోన్‌ నథింగ్‌ ఫోన్‌ 3(a) సిరీస్‌ను ప్రకటించింది. భారత్‌లోని గొప్ప తయారీ వ్యవస్థను అందిపుచ్చుకోవాలన్న కంపెనీ నిబద్ధత, స్థానిక ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడి, సాంకేతిక ఆవిష్కరణలకు చేయూత ఇవ్వాలన్న కంపెనీ విధానాలకు ఇది అనుగుణంగా నిలుస్తోంది. ఉద్యోగ కల్పనలో నథింగ్‌ గణనీయమైన చేయూత అందిస్తోంది. (3a) ఫోన్‌ సిరీస్‌ తయారవుతున్న చెన్నై ఫ్యాక్టరీలో 500లకు ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇందులో 95% మంది మహిళలే. స్థానికంగా తయారు చేయాలన్న బ్రాండ్‌ నిబద్ధతకు అనుగుణంగా నథింగ్‌ ఫోన్‌ (3a) సిరీస్ ఉత్పత్తిలో ఈ కేంద్రం కీలకంగా నిలుస్తోంది. భారత్‌లో నథింగ్‌ బలోపేతమవుతున్న కొద్ది దాని స్థానిక శ్రామిక శక్తి విస్తరిస్తూ, “మేక్‌ ఇన్ ఇండియా’ చర్యకు అనుగుణంగా మరింత బలోపేతమవుతుంది.

బలమైన ప్రగతి ప్రయాణాన్ని కొనసాగిస్తున్న సమయంలో నథింగ్‌ ఈ ప్రకటన చేసింది. భారత్‌లో నెలవారీ స్మార్ట్‌ఫోన్‌ ట్రాక్‌ చేసే కౌంటర్‌ పాయింట్‌ రీసెర్చ్‌ ప్రకారం 2024లో భారత స్మార్ట్‌ ఫోన్‌ మార్కెట్‌లో నథింగ్‌ 577% ఏటికి ఏడు వృద్ధి నమోదు చేసింది. ఫోన్‌ (2a) సిరీస్‌, దాని సబ్‌ బ్రాండ్‌ CMF బై నథింగ్‌ మంచి డిమాండ్‌ను కనబరుస్తున్నాయి. అంతే కాదు, అక్టోబర్‌ 2020లో ప్రారంభమైన తర్వాత కేవలం నాలుగేళ్ల కాలంలో నథింగ్‌ సంస్థ లైఫ్‌టైమ్‌ ఆదాయం $1 బిలియన్‌ దాటిపోయింది.

భారత్‌ మార్కెట్‌పై నిబద్దతకు అనుగుణంగా ఆఫ్టర్‌-సేల్స్‌-సపోర్టు నెట్‌వర్క్‌ బలోపేతాన్ని నథింగ్‌ కొనసాగిస్తోంది. ఐదు ప్రయారిటీ డెస్కులు, 300 మల్టీ బ్రాండ్‌ సర్వీస్‌ సెంటర్లతో పాటు బెంగళూరు, ఢిల్లీ, ముంబయి, హైదరాబాద్‌, చెన్నైలో ఐదు ప్రత్యేక సర్వీసు సెంటర్లను సంస్థ ఇప్పుడు నిర్వహిస్తోంది. గతేడాది ప్రారంభంలో 2,000గా ఉన్న నథింగ్‌ రిటెయిల్‌ ఇప్పుడు 7,000 స్టోర్స్‌కు విస్తరించి, భారతీయ స్మార్ట్‌ఫోన్‌ రంగంలో తన కీలకభూమికను మరింత బలోపేతం చేసుకుంది.

లండన్‌లో డిజైన్ అయిన నథింగ్ ఫోన్‌ (3a) సిరీస్‌ బ్రిటీష్‌ డిజైన్‌ ప్రతిభకు భారతీయ తయారీ నైపుణ్యానికి సమ్మేళనంగా నిలుస్తుంది. అంతర్జాతీయ ఆవిష్కరణకు స్థానిక ఉత్పత్తి తోడైతే ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులు మెచ్చే ఉత్పత్తులు తయారు చేయవచ్చనే ఆలోచనను ఇది తెలియజెప్తుంది.

Next Story