స్మార్ట్ వాచెస్‌పై భారీ డిస్కౌంట్లు ప్రకటించిన నథింగ్
లండన్ కి చెందిన వినియోగదారు టెక్ బ్రాండ్, నథింగ్, బిగ్ బిలియన్ డేస్ సేల్ కి ముందు తమ ఆడియో స్యూట్ మరియు స్మార్ట్ వాచెస్ పై సాటిలేని డిస్కౌంట్లను ప్రకటించింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 16 Sept 2024 6:00 PM ISTలండన్ కి చెందిన వినియోగదారు టెక్ బ్రాండ్, నథింగ్, బిగ్ బిలియన్ డేస్ సేల్ కి ముందు తమ ఆడియో స్యూట్ మరియు స్మార్ట్ వాచెస్ పై సాటిలేని డిస్కౌంట్లను ప్రకటించింది.
సిఎంఎఫ్ వాచ్ ప్రో:
సిఎంఎఫ్ వాచ్ ప్రోకి నాజూకైన అల్యూమినియం అల్లోయ్ ఫ్రేమ్ మరియు అల్యూమినియం అల్లాయ్ ఫ్రేమ్ తో 1.96 – అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే మరియు సాఫీ పనితీరు కోసం 58 ఎఫ్ పిఎస్ రిఫ్రెష్ రేట్ ఉంది. ఇది బిల్ట్-ఇన్ జిపిఎస్ ను, 110 స్పోర్ట్ మోడ్స్, మరియు గుండె కొట్టుకునే రేటు మరియు బ్లడ్ ఆక్సిజన్ స్థాయిలు సహా సమగ్రమైన ఆరోగ్య పర్యవేక్షణకు మద్దతునిస్తుంది. వాచీకి 13 రోజుల వరకు బ్యాటరీ జీవితం ఉంటుంది మరియు దాని ఐపీ68 రేటింగ్ నీటి నిరోధకతను కలిగి ఉంటుంది. ఏఐ టెక్నాలజీ తన బిల్ట్ - ఇన్ మైక్రోఫోన్ మరియు స్పీకర్ ద్వారా నాయిస్ తగ్గింపుతో కాల్ కు స్పష్టత చేకూరుస్తుంది. బిగ్ బిలియన్ డేస్ కి ముందు వాచ్ ప్రో అతి తక్కువ ధర రూ. 2,999కి లభిస్తుంది.
సిఎంఎఫ్ వాచ్ ప్రో 2:
పరస్పరం మార్చదగిన బీజెల్ డిజైన్ తో విలక్షణమైన మరియు స్టైలిష్ స్మార్ట్ వాచ్, 1.32” అమోలెడ్ ఆల్వేజ్ –ఆన్ డిస్ ప్లే అత్యధిక రిజల్యూషన్ ను అందిస్తుంది, మరియు బిల్ట్ ఇన్ మల్టి సిస్టం జిపిఎస్ తో స్మార్ట్ మూవ్ మెంట్ అల్ గోరిథమ్ ద్వారా మద్దతు చేయబడిన 120కి పైగా స్పోర్ట్స్ మోడ్స్ ను మద్దతు చేస్తుంది. కస్టమైజబుల్ ఆప్షన్స్ తో 100కి పైగా వాచ్ ఫేసెస్ ను కలిగి ఉంది. ఇది ఇరవై నాలుగు గంటలు ఆరోగ్య పర్యవేక్షణ, బ్లూటూత్ కాల్స్, మ్యూజిక్ నియంత్రణ, మరియు నోటిఫికేషన్స్ వంటి ఇంటిలిజెంట్ ఫీచర్స్ ను కలిగి ఉంది, కెమేరాను దూరం నుండి నియంత్రించడానికి వీలు కల్పిస్తుంది. ఐపీ68 మరియు దుమ్ము నిరోధకతతో, ఇది చురుకైన జీవన శైలికి మద్దతునిస్తుంది మరియు 11 రోజుల వరకు బ్యాటరీ జీవిత కాలాన్ని అందిస్తుంది. కస్టమర్లు ఇప్పుడు వాచ్ ప్రో 2ని డిస్కౌంటెడ్ ధర రూ. 4,999కి పొందవచ్చు.
నథింగ్ ఇయర్ ( ఏ):
నథింగ్ ఇయర్ (ఏ) అడాప్టివ్ నాయిస్ రద్దు కోసం మరియు డ్యూయల్ ఛాంబర్ డిజైన్ తో ఆధునిక స్మార్ట్ ఏఎన్ సి తో లభిస్తోంది, డ్రైవర్ లోతైన మంద్ర ధ్వనిని ఇస్తుంది. ఇయర్ బడ్స్ కేసుతో 42.5 గంటల వరకు ప్లేబ్యాక్ ను ఇస్తాయి మరియు వేగంగా ఛార్జింగ్ చేయడానికి సహాయపడతాయి. అవి ఒకేసారి రెండు డివైజ్ లను కూడా కనక్ట్ చేస్తాయి మరియు నిరంతరంగా ఏఐ పర్సపర చర్యల కోసం ChatGPTతో సమీకృతం చేస్తుంది. బిబిడికి ముందుగా, కస్టమర్స్ ఇయర్ (ఎ)ని ప్రత్యేకమైన ధర కేవలం రూ. 5,999 కి పొందవచ్చు.
సిఎంఎఫ్ బడ్స్ ప్రో:
సిఎంఎఫ్ బడ్స్ ప్రో 2 డ్యూయల్ డ్రైవర్స్, ఎల్ డిఏసి, హై-రెస్ ఆడియో వైర్ లెస్ ధృవీకరణ, 50 డిబి స్మార్ట్ ఏఎన్ సి తో మెరుగైన ఆడియో అనుభవం కోసం రూపొందించబడింది. స్మార్ట్ డయల్ అనుకూలమైన ఫంక్షన్స్ లో తదుపరి పాట, ఇంతకు ముందు వచ్చిన పాట, వాల్యూమ్ పెంచడం, తగ్గించడం, వాయిస్ అసిస్టెంట్, నాయిస్ కాన్సిలేషన్ మోడ్స్ మధ్య మార్చడం వంటివి ఉన్నాయి. లోతుగా లీనమవ్వాలని కోరుకునే వారికి, స్పేషియల్ ఆడటియో ప్రభావం త్రీ-డైమన్షనల్ సౌండ్ స్పేస్ తో శ్రోతలకు వినిపిస్తుంది. అవి 43 గంటల మొత్తం బ్యాటరీ జీవితాన్ని మరియు 7 గంటల ప్లేబ్యాక్ కోసం వేగవంతమైన 10 నిముషాల ఛార్జీని అందిస్తాయి. సిఎంఎఫ్ బడ్స్ ప్రో 2 ప్రత్యేకమైన ధర రూ.3,499కి ఇప్పుడు లభిస్తున్నాయి.
సిఎంఎఫ్ బడ్స్ :
సిఎంఎఫ్ బడ్స్ శ్రేణిలో ఉత్తమమైన ఏఎన్ సి ఫీచర్ ని కలిగి ఉంది, ఇది 43 డిబి వరకు ధ్వనిని తగ్గిస్తుంది. బయటి సౌండ్స్ ను మిశ్రమం చేయడానికి ట్రాన్స్ పరెన్సీ మోడ్ అందిస్తుంది. నాలుగు హెచ్ డి మైక్స్ తో కాల్స్ స్పష్టంగా ఉంటాయి మరియు క్లియర్ వాయిస్ టెక్నాలజీని కలిగి ఉంది. డిరాక్ ఆప్టియో టిఎం మరియు ఫైవ్ ఈక్యూ సెట్టింగ్స్ ద్వారా మెరుగుపరచబడిన 12.4 మీమీ బయో-ఫైబర్ డ్రైవర్ మరియు అల్ట్రా బాస్ టెక్నాలజీ 2.0 డైనమిక్ సౌండ్ ను అందిస్తుంది. యూజర్స్ 8 గంటల వరకు ప్లేబ్యాక్ ను అనుభవించవచ్చు, కేసుతో 35.5 గంటలు ఎక్స్ టెండ్ చేయవచ్చు మరియు పది నిముషాల ఛార్జీతో 6.5 గంటలు పని చేస్తుంది. సిఎంఎఫ్ బడ్స్ బిగ్ బిలియన్ డేస్ కి ముందు ప్రత్యేకమైన ధర రూ. 1,999కి అమ్ముడవుతోంది.
సిఎంఎఫ్ నెక్ బ్యాండ్ ప్రో:
సిఎంఎఫ్ నెక్ బ్యాండ్ ప్రో మొదటి 50 డిబి హైబ్రీడ్ ఏఎన్ సిని తన శ్రేణిలో పరిచయం చేసింది, ఏ వాతావరణం కోసమైనా స్పష్టమైన సౌండ్ ను అందిస్తోంది. వాతావరణానికి అనుకూలమైన ఏఎన్ సి మరియు 30 మిలియన్ కి పైగా సౌండ్ శ్యాంపిల్స్ తో పరీక్షించబడిన ఏఐ నాయిస్ కాన్సిలేషన్ అల్ గోరిథమ్ తో, కాల్ స్పష్టత సాటిలేనిదిగా ఉంటుంది. ఫిట్ నెస్, విశ్రాంతి రెండిటి కోసం రూపొందించబడిన ఇది శ్రమ లేకుండా నియంత్రించడానికి క్లియర్ వాయిస్ టెక్నాలజీ మరియు 3 ఇన్ 1 స్మార్ట్ డయల్ తో 5 హెచ్ డి మైక్స్ ను కలిగ ఉంది. నీరు, చెమట, దుమ్ము నిరోధకత కోసం ఐపీ 55 రేటింగ్ తో, ఇది రోజూవారీ తీవ్రతలను తట్టుకుంటుంది. నెక్ బ్యాండ్ ప్రో 37 గంటల ప్లే బాక్ ను లేదా 10 నిముషాల ఛార్జీతో 18 గంటల ప్లే బ్యాక్ ను అందిస్తుంది. నెక్ బ్యాండ్ ప్రోను కొనుగోలు చేయాలని కోరుకునే కస్టమర్స్ దీనిని రూ.1,799 ప్రత్యేకమైన ధరకు కొనుగోలు చేయవచ్చు.