ఉడాన్ భాగస్వామ్యంతో వస్తున్న నాయిస్
Noise smartwatches to be exclusively available on the udaan platform. భారతదేశంలో సుప్రసిద్ధ ఆడియో మరియు వేరబల్ తయారీదారు నాయిస్.
By Medi Samrat Published on 11 July 2022 4:30 PM ISTభారతదేశంలో సుప్రసిద్ధ ఆడియో మరియు వేరబల్ తయారీదారు నాయిస్. నేడు తమ కలర్‌ఫిట్ క్యూబ్ ప్లస్ ఎస్‌పీఓ2 ఎడిషన్ స్మార్ట్‌వాచీల కోసం ప్రత్యేకంగా డిస్ట్రిబ్యూషన్ భాగస్వామ్యం చేసుకున్నట్లు వెల్లడించింది. ఈ భాగస్వామ్యంలో భాగంగా నాయిస్ శ్రేణి స్మార్ట్ వాచీలు భారతదేశంలో అతిపెద్ద బిజినెస్ టు బిజినెస్ ఈ–కామర్స్ వేదిక ఉడాన్‌పై లభ్యమవుతాయి. ఈ నాయిస్ శ్రేణి స్మార్ట్ వాచీలు ఉడాన్ ప్లాట్‌ఫామ్‌పై ఎలక్ట్రానిక్స్ విభాగంలో 12500కు పైగా పిన్‌కోడ్‌ల వ్యాప్తంగా 1200 పట్టణాలలో లభ్యం కానున్నాయి.
అత్యంత విజయవంతమైన కలర్‌ఫిట్ క్యూబ్ ఎస్‌పీఓ2 వాచ్‌కు అప్‌గ్రేడెడ్ వెర్షన్ నాయిస్ కలర్‌ఫిట్ క్యూబ్ ప్లస్. ఈస్మార్ట్ వాచ్ ధర 4999 రూపాయలు. హార్ట్ సెన్సర్, టచ్ స్ర్కీన్ డిస్‌ప్లే, వారం రోజుల బ్యాటరీ లైఫ్, మల్టీపుల్ స్పోర్ట్స్ మోడ్స్, ఐపీ68 వాటర్‌ఫ్రూఫ్ మరియు మరెన్నో ఉన్నాయి.
నాయిస్ కో–ఫౌండర్ –సీఈవో గౌరవ్ ఖత్రి మాట్లాడుతూ '' కార్యకలాపాలు ప్రారంభించిన నాటి నుంచి విప్లవాత్మక ఉత్పత్తులను అందించడానికి నాయిస్ ప్రయత్నిస్తూనే ఉంది. ఈ తాజా ఉత్పత్తి ఆవిష్కరణ మరింతగా మా స్ధానాన్ని వినియోగదారుల అభిమాన బ్రాండ్‌గా స్థిరీకరించనుంది. వినూత్న సాంకేతికతలతో నూతన ఉత్పత్తులను పరిచయం చేయడం మేము కొనసాగించనున్నాము. ఇవి వినియోగదారులకు అత్యంత అందుబాటు ధరలలో వీలైనంత ఉత్తమ అనుభవాలను అందించనున్నాయి'' అని అన్నారు.
ఉడాన్, ఎలక్ట్రానిక్స్ కేటగిరి హెడ్ హిరేంద్రకుమార్ రాథోడ్ మాట్లాడుతూ '' అత్యంత అందుబాటు ధరలలో విప్లవాత్మక ఉత్పత్తులను భారత్ వ్యాప్తంగా రిటైల్ భాగస్వాములకు అందించడం కోసం మేము ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము. సుప్రసిద్ధ బ్రాండ్ల నడుమ ఉడాన్ పట్ల ఉన్న నమ్మకాన్ని ఈ ప్రత్యేక భాగస్వామ్యం ప్రతిబింబిస్తుంది. నూతన మార్కెట్‌లలో ప్రవేశించేందుకు అత్యంత అందుబాటు ధరలలో జాతీయ పంపిణీ నెట్‌వర్క్‌ను మేము అందించగలము'' అని అన్నారు.