నాయిస్ కలర్ ఫిట్ పల్స్ గ్రాండ్ లాంచ్.. త‌క్కువ ధ‌ర‌లో సరికొత్త స్మార్ట్ వాచ్

Noise ColorFit Pulse Grand Smartwatch With 1.69-Inch LCD Display. నాయిస్ కలర్ ఫిట్ పల్స్ గ్రాండ్ ColorFit శ్రేణిలో భాగంగా సరికొత్త స్మార్ట్ వాచ్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  14 Feb 2022 2:23 PM IST
నాయిస్ కలర్ ఫిట్ పల్స్ గ్రాండ్ లాంచ్.. త‌క్కువ ధ‌ర‌లో సరికొత్త స్మార్ట్ వాచ్

నాయిస్ కలర్ ఫిట్ పల్స్ గ్రాండ్ ColorFit శ్రేణిలో భాగంగా సరికొత్త స్మార్ట్ వాచ్ ను తీసుకుని వచ్చింది. ఆ స్మార్ట్ వాచ్ లో అనేక ఫిట్‌నెస్ ఫీచర్‌లు ఉన్నాయి. ఇతర బ్రాండ్‌ల స్మార్ట్ వాచ్ లలో లేని అదనపు ఆప్షన్స్ తో ఈ స్మార్ట్ ఫోన్ వస్తుంది. వాచ్ కంటే ఎక్కువ స్క్రీన్ స్పేస్‌ను ఇచ్చే స్క్వేర్ డిస్‌ప్లేతో వస్తుంది. టచ్ స్క్రీన్‌ మాత్రమే కాకుండా స్మార్ట్ వాచ్ ఫేసెస్ కూడా ఇందులో ఉన్నాయి. 'పల్స్ గ్రాండ్‌' లో అందించబడిన వాచ్ ఫేస్‌లు సమయం, ఆరోగ్య ట్రాకింగ్ డేటా వంటి వివిధ వివరాలను మనకు ప్రదర్శిస్తాయి.

నాయిస్ కలర్ ఫిట్ పల్స్ గ్రాండ్ స్పెసిఫికేషన్స్

నాయిస్ కలర్‌ఫిట్ పల్స్ గ్రాండ్ 1.69-అంగుళాల LCD స్క్రీన్‌ను, నావిగేషన్ కోసం రౌండ్ డయల్‌ను కలిగి ఉంది. మీరు Apple వాచ్‌లోనూ, చాలా వాటిపై ఒకే రకమైన డిజైన్‌ను చూస్తారు. కలర్‌ఫిట్ పల్స్ గ్రాండ్ స్మార్ట్‌వాచ్ 150 వాచ్ ఫేస్‌లతో వస్తుంది. ఈ వాచ్ ఫేస్‌లు ఒక్కొక్కటి ఒక్కో రకమైన సమాచారాన్ని ప్రదర్శిస్తాయి. వ్యక్తి ఆరోగ్యం, వాతావరణ నివేదికలు మొదలైనవి తెలుసుకోవచ్చు. బ్రాండ్ నుండి ఈ వాచ్ ఫేస్‌లు క్లౌడ్‌లో అందుబాటులో ఉంటాయి. వినియోగదారుడి అవసరం, మూడ్ ని బట్టి మార్చుకోవచ్చు. డెడికేటెడ్ అప్లికేషన్ నుండి కావలసిన వాచ్ ఫేస్‌ని ఎంచుకోవచ్చు. నోటిఫికేషన్ అలర్ట్స్, మ్యూజిక్ ప్లేబ్యాక్ వంటివి చూసుకోవచ్చు. బ్లూటూత్ ద్వారా స్మార్ట్‌ఫోన్ కు కనెక్ట్ చేయబడుతుంది. వాచ్ IP68 సర్టిఫికేషన్‌తో వస్తుంది. 15 నిమిషాల చార్జింగ్ తో 25 గంటల బ్యాటరీ లైఫ్ దొరుకుతుంది. గడియారం అనేక విభిన్న మోడ్‌లతో వస్తుంది. హృదయ స్పందన పర్యవేక్షణ, రక్తంలో ఆక్సిజన్ స్థాయి, నిద్ర, ఋతు చక్రాలను ట్రాక్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

నాయిస్ కలర్ ఫిట్ పల్స్ గ్రాండ్ ధర, లభ్యత

నాయిస్ నుండి కొత్త కలర్ ఫిట్ పల్స్ గ్రాండ్ ధర రూ. 3999 అయినప్పటికీ.. పరిచయ ఆఫర్ ధర రూ. 1,999 గా నిర్ణయించారు. ఈ గడియారాలు నాలుగు ప్రత్యేక రంగులలో వస్తాయి. షాంపైన్ గ్రే, ఎలక్ట్రిక్ బ్లూ, జెట్ బ్లాక్, ఆలివ్ గ్రీన్ లలో లభ్యమవుతాయి. భారతదేశంలోని ఇ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్‌లో ఫిబ్రవరి 18 నుండి మధ్యాహ్నం 12 గంటలకు అందుబాటులోకి రానుంది.


Next Story