వచ్చే నెల 22 నుంచి కొత్త జీఎస్టీ శ్లాబ్స్!
దసరా పండుగ డిమాండ్ నేపథ్యంలో వచ్చే నెల 22 నుంచి జీఎస్టీ కొత్త శ్లాబ్స్ అమలు కానున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
By అంజి
వచ్చే నెల 22 నుంచి కొత్త జీఎస్టీ శ్లాబ్స్!
దసరా పండుగ డిమాండ్ నేపథ్యంలో వచ్చే నెల 22 నుంచి జీఎస్టీ కొత్త శ్లాబ్స్ అమలు కానున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సెప్టెంబర్ 3, 4 తేదీల్లో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. జీఎస్టీని సరళీకరిస్తూ అన్ని వస్తువులపై ట్యాక్స్‌ను రెండు శ్లాబ్స్ (5 శాతం, 18 శాతం)కు పరిమితం చేయాలని కేంద్రం భావిస్తున్న విషయం తెలిసిందే. మీటింగ్‌లో చర్చించి వీటిపై కౌన్సిల్ నిర్ణయం తీసుకోనుంది. అయితే లగ్జరీ వస్తువులకు మాత్రం 40 శాతం జీఎస్టీ ఉండనుంది.
ప్రస్తుతం జీఎస్టీలో 5 శ్లాబ్స్ (0 శాతం, 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం) ఉండగా కేంద్రం వాటిని 2కి (5 శాతం, 18 శాతం) తగ్గించనుంది. 'sin' యాక్టివిటీ అనే ప్రత్యేక కేటగిరీని చేర్చి.. సమాజానికి హాని చేసే ఆన్‌లైన్ గేమింగ్, పొగాకు లాంటి ఐటమ్స్‌పై 40 శాతం పన్ను వేసే అవకాశం ఉంది. ప్రస్తుతం 12 శాతం శ్లాబ్‌లో ఉన్న 99 శాతం వస్తువులను 5 శాతం శ్లాబ్‌లోకి, 28 శాతం శ్లాబ్‌లో ఉన్న 90 శాతం వస్తువులను 18 శాతం శ్లాబ్‌లోకి మార్చే ఛాన్స్ ఉంది.
కొత్త విధానంలో 12 శాతం, 28 శాతం శ్లాబ్స్ ఉండవు. దీని వల్ల ఆటోమొబైల్, నిత్యావసరాల ధరలు భారీగా తగ్గనున్నాయి.
ధరలు తగ్గనున్న వస్తువులు ఇవే?
5 శాతం జీఎస్టీ శ్లాబ్: టూత్ పేస్ట్, చిప్స్, జామ్, జ్యూస్, పాస్తా, నూడిల్స్, వెన్న, నెయ్యి, ఔషధాలు, వ్యవసాయ ఉత్పత్తులు
18 శాతం జీఎస్టీ శ్లాబ్: టీవీ, కంప్యూటర్, ఫర్నీచర్, వాషింగ్ మెషీన్స్, వాటర్ ఫిల్టర్స్, కుట్టు మెషీన్లు, ఎలక్ట్రానిక్స్.
40 శాతం జీఎస్టీ స్పెషల్ శ్లాబ్: పొగాకు ఉత్పత్తులు, ఆన్‌లైన్ గేమింగ్, బీర్, లగ్జరీ ఐటమ్స్.
ఆహారం, అత్యవసర మందులు, విద్యకు 0 శాతం కొనసాగుతుంది. హెల్త్ ఇన్సూరెన్స్‌ని కూడా ఇందులోకి తెచ్చే అవకాశం ఉంది.