ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న 'నేను సూపర్ వుమెన్' బిజినెస్ రియాలిటీ షో
Nenu Super Woman south india shark tank women entrepreneurs streaming aha. 100 % లోకల్ తెలుగు ఓటీటీ మాధ్యమంగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనైదైన స్థానాన్ని
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 21 July 2023 8:08 PM IST‘నేను సూపర్ వుమెన్’ రియాలిటీ షోకు శ్రీరామచంద్ర హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. మహిళా సాధికారత విషయంలో ఆహా ఎంత నిబద్ధతగా ఉందనే విషయాన్ని తెలియజేసేలా ఏంజెల్స్ కమిటీని కూడా రూపొందించారు. ఇందులో సక్సెస్‌ఫుల్ వ్యాపారవేత్తలున్నారు. వీరు షోలో పాల్గొన్న కంటెస్టెంట్స్ ఐడియాలపై పెట్టుబడులతో బాటు, వారికి మార్గనిర్దేశకం చేస్తారు. ఈ ఏంజెల్స్ కమిటీలో డార్విన్ బాక్స్ సహ వ్యవస్థాపకుడు రోహిత్ చెన్నమనేని, క్వాంటేలా కంపెనీ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ శ్రీధర్ గాంధి, సిల్వర్ నీడిల్ వెంచర్స్ రేణుక బొడ్ల, అభి బస్ సీఈఓ, వ్యవస్థాపకుడు సుధాకర్ రెడ్డి, దొడ్ల డైరీ ఫౌండర్ దొడ్ల దీపా రెడ్డి, బజాజ్ ఎలక్ట్రానిక్ కరణ్ బజాజ్, నారాయణ గ్రూప్ సింధూర పొంగూరు ఉన్నారు.
డార్విన్ బాక్స్ సహ వ్యవస్థాపకుడు రోహిత్ చెన్నమనేని మాట్లాడుతూ ‘‘వ్యాపార రంగంలో రాణించాలనుకునే మహిళలకు ‘నేను సూపర్ వుమెన్’ అనేది ఓ గేమ్ చేంజర్ షో. వారి వ్యాపార కలలను నిజం చేసుకోవడానికి, కొత్త ఆలోచనలతో సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించటానికి ఇదొక వేదిక అని చెప్పొచ్చు. ఈ మహిళా సాధికారిక షోలో భాగం కావటం మహిళలు ప్రారంభించే కొత్త వ్యాపారల్లో వృద్ధి చెందటానికి దోహదపటం అనేది గౌరవంగా భావిస్తున్నా,” అన్నారు.
కరణ్ బజాజ్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ మాట్లాడుతూ, ‘‘ఇదొక అద్భుతమైన వేదిక. నా దశాబ్దాల అనుభవాన్ని పంచుకోవటానికి వారికి గైడెన్స్ ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను. కొన్ని అద్భుతమైన ప్రయాణాలు ఇక్కడి నుంచే ప్రారంభం అవుతాయి. ఈ సందర్భంగా నేను సూపర్ ఉమెన్ ఎంటైర్ టీమ్‌ని అభినందిస్తున్నాను,” అన్నారు.
సిల్వర్ నీడెల్ వెంచర్స్ పార్ట్‌నర్ రేణుక బొడ్ల మాట్లాడుతూ ‘‘నా ప్రయాణం మొదలు పెట్టినపుడు చాలా తక్కువ మంది మహిళా వ్యాపారవేతులు ఉన్నారు. ఎప్పుడైతే మహిళ వ్యాపారవేత్త ధైర్యంగా నిలబడగలుగుతుందో, తన వ్యాపార నమూనాలను, ఆలోచనలను గొప్పగా ప్రదర్శిస్తుందో, నాకెంతో సంతోషంగా అనిపిస్తుంది. ఆహా వారు నిర్వహిస్తోన్న నేను సూపర్ వుమెన్ అనేది మహిళల్లోనే వ్యాపార స్ఫూర్తిని పెంపొందించే ఓ గొప్ప కార్యక్రమం. వ్యాపారంలో రాణించాలనుకునే మహిళలు, వారు విజయవంతంగా నిర్వహించే వ్యాపారాలను ప్రోత్సహించే ఇలాంటి ప్రయాణంలో నేను భాగమవుతున్నందుకు థ్రిల్లింగ్‌గా ఉంది,” అన్నారు.
డైరెక్టర్ ఆఫ్ నారాయణ కాలేజెస్ సింధూర పొంగూరు మాట్లాడుతూ.. ‘‘తెలుగు రాష్ట్రాల్లో కొత్త శకానికి ఇదొక నాంది. నేను సూపర్ వుమెన్ అనేది స్త్రీ సాధికారతను పెంపెందించే ఓ అసాధారణమైన వేదిక. మహిళల్లోని ప్రతిభ, వ్యాపార నైపుణ్యాలను బయటపెడుతుంది. ఇతర మహిళల వ్యాపారాల్లో భాగమయ్యి, వారి ఆశయాలను నెరవేర్చే ఇలాంటి కార్యక్రమంలో నేను భాగం కావటం అనేది గౌరవంగా భావిస్తున్నాను,” అన్నారు.
క్వాంటెలా ఇన్క్ ఫౌండర్ చైర్మన్ శ్రీధర్ గాది మాట్లాడుతూ, ‘‘నేను సూపర్ ఉమెన్ ప్రోగ్రాం వల్ల వ్యాపారంలో రాణించాలనుకుంటున్న మహిళలు, వారి ఆలోచనలు గురించి తెలుసుకునే గొప్ప అవకాశం దక్కింది. మహిళా వ్యాపారవేత్తల అపారమైన సామర్థ్యానికి, సృజనాత్మకతకు ఇదొక నిదర్శనం. వ్యాపార రంగంలో ఓ సరికొత్త అర్థవంతమైన మార్పుని తీసుకు రావటంతో పాటు మరిన్ని కొత్త అవకాశాలకు మార్గాలను ఏర్పరుచుకున్నట్లే,” అన్నారు.
వి-హబ్ సీఇఓ దీప్తి రావు, ఆహా కంటెంట్ హెడ్ వాసుదేవ్ కొప్పినేని ‘నేను సూపర్ ఉమెన్’ అనేది అందరిలోనూ ఓ సానుకూలా దృక్పథాన్ని ఏర్పరుస్తుందని నమ్మకంగా ఉన్నారు. ‘‘ఓ వ్యాపారవేత్తగా మరీ ముఖ్యంగా మహిళా వ్యాపారవేత్తగా ఉండటం అనేది చాలా ధైర్యంతో కూడుకున్నది. ధైర్యంతో పాటు పట్టుదల, సంకల్పం అవసరం. వి -హబ్ అనేది తెలంగాణ ప్రభుత్వం యొక్క చొరవతో రూపుదాల్చింది. నేను సూపర్ వుమెన్ షో చాలా మంది మహిళలకు స్ఫూర్తినిస్తుందని, కొత్త కొత్త విషయాల రూపకల్పనలను ప్రోత్సహిస్తుందని నమ్ముతున్నాను”, అని దీప్తి రావుల తెలిపారు.
వాసుదేవ్ మాట్లాడుతూ.. ఆహా ఈ షో చేస్తున్నందుకు ఎంతో గర్వంగా ఉంది. మహిళలు వారి కలలను నేరవేర్చుకోవటానికి, సామర్థ్యాన్ని బయట పెట్టటానికి ఓ వేదికను అందిస్తున్నాం,” అన్నారు. ఆహా వారి సరికొత్త ప్రయాణం ‘నేను సూపర్ వుమెన్’ బిజినెస్ రియాలిటీ షో మహిళల నేతృత్వంలో కొత్త వ్యాపారాలను ప్రారంభించదానికి సరికొత్త బాటలు వేస్తుందనడంలో సందేహం లేదు. జూలై 21 నుంచి ప్రతి శుక్ర, శని వారాల్లో ఆహాలో ‘నేను సూపర్ ఉమెన్’ స్ట్రీమింగ్ అవుతుంది.