4 నెలల మనవడికి రూ.240 కోట్ల విలువైన షేర్లను బహుమతిగా ఇచ్చిన నారాయణ మూర్తి

ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి తన నాలుగు నెలల మనవడు ఏకాగ్ర రోహన్ మూర్తికి రూ.240 కోట్ల విలువైన షేర్లను బహుమతిగా ఇచ్చారు

By Medi Samrat  Published on  18 March 2024 10:26 AM GMT
4 నెలల మనవడికి రూ.240 కోట్ల విలువైన షేర్లను బహుమతిగా ఇచ్చిన నారాయణ మూర్తి

ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి తన నాలుగు నెలల మనవడు ఏకాగ్ర రోహన్ మూర్తికి రూ.240 కోట్ల విలువైన షేర్లను బహుమతిగా ఇచ్చారు. ఎక్స్ఛేంజ్ ఫైలింగ్స్ ప్రకారం.. ఎకాగ్రా రోహన్ మూర్తి 15,00,000 షేర్లతో భారత్‌లోని రెండవ అతిపెద్ద సమాచార సాంకేతిక సేవల కంపెనీలో 0.04 శాతం కలిగి ఉన్నాడు.

తన మనవడికి షేర్లను విరాళంగా ఇచ్చిన తర్వాత ఇన్ఫోసిస్‌లో నారాయణ మూర్తి వాటా 0.40 శాతం నుంచి 0.36 శాతానికి తగ్గింది. ప్రస్తుతం ఆయన కంపెనీలో దాదాపు 1.51 కోట్ల షేర్లను కలిగి ఉన్నారు. ఫైలింగ్ ప్రకారం.. లావాదేవీ 'ఆఫ్-మార్కెట్' పద్ధతిలో జరిగింది. నవంబర్‌లో నారాయణ మూర్తి, సుధా మూర్తిల కుమారుడు రోహన్ మూర్తి, అత‌ని భార్య అపర్ణ కృష్ణన్ లకు కుమారుడు జ‌న్మించ‌డంతో వీరు గ్రాండ్ పేరెంట్స్ అయ్యారు. నారాయణ మూర్తి, సుధా మూర్తిలు బ్రిటీష్ PM రిషి సునక్ భార్య‌ అక్షతా మూర్తికి కూడా తల్లిదండ్రులు. నారాయణమూర్తి 1981లో ఇన్ఫోసిస్‌ను స్థాపించారు. కంపెనీ మార్చి 1999లో నాస్‌డాక్‌లో జాబితా చేయబడింది.

Next Story