ముఖేష్ అంబానీ రిలయన్స్ జియో బోర్డు డైరెక్టర్ పదవికి రాజీనామా చేసారు. ముఖేష్ పెద్ద కుమారుడు ఆకాష్‌కు కంపెనీ పగ్గాలను అప్పగించారు, ఆకాష్ అంబానీ నియామకాన్ని కంపెనీ బోర్డు సమావేశంలో ఆమోదించినట్లు తెలిపారు. నిన్నటి నుండే ముఖేష్ రాజీనామా అమల్లోకి వచ్చింది. జూన్ 27, 2022 నుండి ప్రారంభమయ్యే ఐదేళ్ల కాలానికి రిలయన్స్ జియో మేనేజింగ్ డైరెక్టర్‌గా పంకజ్ మోహన్ పవార్ నియామకాన్ని బోర్డు సమావేశంలో ఆమోదించింది. రమీందర్ సింగ్ గుజ్రాల్, కెవి చౌదరిలు ఇండిపెండెంట్ డైరెక్టర్‌లుగా నియమితులయ్యారు.
అయితే, రిలయన్స్ జియోతో సహా అన్ని జియో డిజిటల్ సేవల బ్రాండ్‌లను కలిగి ఉన్న జియో ప్లాట్‌ఫారమ్స్ లిమిటెడ్ ఛైర్మన్‌గా ముఖేష్ అంబానీ కొనసాగుతారు. ఆకాష్.. యూఎస్‌లోని బ్రౌన్ యూనివర్శిటీ నుండి ఎకనామిక్స్ లో గ్రాడ్యుయేట్. కొత్త టెక్నాలజీ అభివృద్ధి.. డేటా మరియు టెక్నాలజీని అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి ఆకాష్ కృషి చేస్తూనే ఉంటారని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.