రిలయన్స్ లో భారీ మార్పును చూడబోతున్నామా..?

Mukesh Ambani says time to make way for younger leaders. మార్కెట్ క్యాపిటలైజేషన్ ద్వారా భారతదేశపు అత్యంత విలువైన కంపెనీ అయిన

By Medi Samrat  Published on  29 Dec 2021 12:00 PM IST
రిలయన్స్ లో భారీ మార్పును చూడబోతున్నామా..?

మార్కెట్ క్యాపిటలైజేషన్ ద్వారా భారతదేశపు అత్యంత విలువైన కంపెనీ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL)లో త్వరలోనే అధికారంలో మార్పును చూడవచ్చు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, సీనియర్ సహోద్యోగులతో పాటు యువ తరానికి పగ్గాలను అప్పగించే ప్రక్రియను వేగవంతం చేయాలని అనుకుంటున్నట్లు ప్రకటించారు.తన తండ్రి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారసత్వాన్ని అందజేసే ప్రక్రియను ప్రారంభించినట్లు వెల్లడించారు. "పెద్ద కలలు, అసాధ్యమైన లక్ష్యాలను సాధించడానికి సరైన వ్యక్తులను నియమించడం.. సరైన నాయకత్వం అందించడం అవసరం" అని అంబానీ చెప్పడంతో.. రిలయన్స్‌లో గణనీయమైన నాయకత్వ మార్పు మొదలవుతుందని.. తనతో పాటు, సీనియర్‌ వ్యక్తులు యువ నాయకులు అందరినీ మార్చే ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు చెప్పారు అంబానీ. ముఖేష్ అంబానీ పిల్లలైన ఇషా, ఆకాష్, అనంత్‌లలో సింహాసనం ఎవరికి దక్కుతుంది అనేదే కాకుండా పలు అంశాలపై తీవ్ర చర్చ మొదలైంది.

తనతో సహా పాత తరంతో ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని, యువ తరానికి మార్గం కల్పించాలని తాను కోరుకుంటున్నట్లు అంబానీ చెప్పారు. గ్రూప్ వ్యవస్థాపకుడు ధీరూభాయ్ అంబానీ జన్మదినాన్ని పురస్కరించుకుని వార్షిక ఈవెంట్ రిలయన్స్ ఫ్యామిలీ డేలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోని మూడు అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌ ఒకటిగా అవతరించనుందని, ఆర్‌ఐఎల్‌ ప్రపంచంలోనే అత్యంత బలమైన, ప్రఖ్యాతి చెందిన భారతీయ బహుళజాతి కంపెనీల్లో ఒకటిగా అవతరిస్తుందని ఆయన అన్నారు.

గతంలో మనం సాధించిన దాని గురించి మనం ఎన్నటికీ సంతృప్తి చెందకూడదని అన్నారు. ధీరూభాయ్ అంబానీ వారసత్వానికి తమను తాము నిజమైన వారసులమని చెప్పుకునే హక్కును నేటి మరియు రేపటి నాయకులు సంపాదించుకోవడానికి ఇదే ఏకైక మార్గం అని ఆయన అన్నారు. రిలయన్స్ సంస్థను నూతన స్థాయికి తీసుకెళ్లడంలో తర్వాతి తరం ప్రతినిధులు అయిన ఆకాశ్, ఈశా, అనంత్ శాయశక్తులు కృషి చస్తారనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు.


Next Story