అద్భుతమైన ఫీచర్స్‌తో మోటో జీ-32 స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసిన మోటరోలా..!

Motorola launched the Moto G-32 smartphone. ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్‌ రంగంలో అప్రతిహతంగా దూసుకుపోతోన్న కంపెనీ మోటరోలా

By Medi Samrat  Published on  9 Aug 2022 7:30 PM IST
అద్భుతమైన ఫీచర్స్‌తో మోటో జీ-32 స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసిన మోటరోలా..!

ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్‌ రంగంలో అప్రతిహతంగా దూసుకుపోతోన్న కంపెనీ మోటరోలా. ఇప్పటికే ఎన్నో విభిన్న రకాల స్మార్ట్‌ఫోన్‌లను వినియోగదారులకు అందించింది. అంతేకాకుండా మారుతున్న వినియోగదారుల అభిరుచులను, కాలానుగుణంగా వస్తోన్న మార్పులకు తగ్గట్లుగా స్మార్ట్‌ఫోన్లను అందిస్తోంది. అందులో భాగంగా జీ సిరీస్‌ను లాంచ్‌ చేసింది. ఇప్పుడు ఈ జీ సిరీస్‌ ఫ్రాంచైజీలో వినియోగదారుల కోసం మోటో జీ32ని లాంచ్‌ చేసింది మోటరోలా. ఇది అందరికి అద్భుతంగా ఉపయోగపడే స్మార్ట్‌ ఫోన్‌. ఇంకా చెప్పాలంటే అందరూ #AllYouWant కోరుకునే ఫోన్‌. దీని ప్రారంభ ధరను రూ. 12,999గా నిర్ణయించారు.

అయితే వినియోగదారులు దీన్ని కేవలం రూ. 11,749కే పొందవచ్చు. (హెచ్‌డిఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై రూ. 1,250 వరకు తక్షణ తగ్గింపుతో) సూపర్ స్మూత్ 90హెచ్‌జెడ్‌ 6.5" ఎఫ్‌హెచ్‌డి డిస్‌ప్లేతో రూపొందిన ఈ స్మార్ట్‌ఫోన్‌.. స్పష్టమైన వీక్షణని అందిస్తుంది. అద్భుతమైన డిస్‌ప్లేతో పాటు, మోటో జీ32లో డాల్బీ అట్మోస్తో కూడిన స్టీరియో స్పీకర్‌లు ఉన్నాయి. ఇది వినియోగదారునికి అద్భుతమైన సౌండ్‌తో పాటు మెరుగైన స్పష్టతని అందిస్తుంది. అన్నింటికి మించి ప్రతి బీట్‌లో మెరుగైన బాస్‌ని అందిస్తుంది. అన్నింటికి మించి, స్మార్ట్‌ఫోన్‌ పనితీరును మరింతగా పెంచేందుకు , ఎలాంటి ఇబ్బందులు లేని పర్‌ఫార్మెన్స్‌ని అందించేందుకు ఇందులో స్నాప్‌డ్రాగన్‌ 680 ఆక్టా-కోర్ ప్రాసెసర్ ఉంది.

మోటో జి 32 స్మార్ట్‌ ఫోన్‌ నియర్‌ స్టాక్‌ ఆండ్రాయిడ్ 12తో వస్తుంది. అంతేకాకుండా అద్భుతమైన సెక్యూరిటీ కోసం థింక్‌షీల్డ్‌ సెక్యూరిటీ ఇందులో ఉంది. అది మీ వ్యక్తిగత విషయాలపై మరింత గోప్యతను అందిస్తుంది. దీంతోపాటు ఫోన్ ఆండ్రాయిడ్ 13కి హామీ ఇవ్వబడిన అప్‌డేట్‌తో వస్తుంది. 3 ఏళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లకు హామీ ఇస్తుంది.

మరోవైపు మీ ఫోన్‌ని ఛార్జ్ చేయడం గురించి ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇందులో 33 వాట్స్‌ టర్బోపవర్‌ ఛార్జర్‌తో కూడిన భారీ 5000ఎమ్‌ఏహెచ్‌ వస్తుంది. కాబట్టి మీరు మీ బ్యాటరీ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు.

మోటో జి 32 స్మార్ట్‌ఫోన్‌ 50 మెగాపిక్సెల్‌ క్వాడ్ ఫంక్షన్ కెమెరా సిస్టమ్, 16 మెగాపిక్సెల్‌ సెల్ఫీ కెమెరాను అందిస్తుంది. ఇది మీకు ఏ లైట్‌లోనైనా సూపర్ క్లియర్ షాట్‌లను అందిస్తుంది. ప్రామాణిక 78º లెన్స్‌తో పోలిస్తే ఫ్రేమ్ 8 మెగాపిక్సెల్‌ అల్ట్రా-వైడ్, డెప్త్ కెమెరా, 118º అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్ 4 రెట్లు ఎక్కువ సరిపోతుంది. అలాగే, ప్రొఫెషనల్‌గా కనిపించే పోర్ట్రెయిట్‌ల కోసం బ్యాక్‌గ్రౌండ్‌ని ఆటోమేటిక్‌గా బ్లర్ చేయడానికి ప్రధాన కెమెరాతో పని చేయడం ద్వారా ఇది డెప్త్‌ను కూడా అందించగలదు.

మోటో జి 32 స్మార్ట్‌ఫోన్‌ 64జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో వస్తుంది. మైక్రో ఎస్‌డి కార్డ్‌ని ఉపయోగించి 1టీబీ వరకు స్టోరేజ్‌ని విస్తరించుకోవచ్చు. తద్వారా తమ ఫోటోలు, గేమ్‌లు, సినిమాలు, యాప్‌లు, పాటల కోసం చాలా స్పేస్‌ని ఆస్వాదించవచ్చు. వీటితోపాటు ఈ స్మార్ట్‌ఫోన్‌ ఐపీ 52 వాటర్ రిపెల్లెంట్ డిజైన్‌తో వస్తుంది. మీ స్మార్ట్‌ఫోన్‌ను వేగంగా అన్‌లాక్ చేయడానికి సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ రీడర్, 2x2 మిమో మరియు మరిన్నింటిని కూడా అందిస్తుంది.

అందుబాటు మరియు ధర వివరాలు:

ఫ్లిప్‌కార్ట్, ప్రముఖ రిటైల్ స్టోర్‌లలో 16, ఆగష్టు, 2022 మధ్యాహ్నం 12 గంటలనుంచి వినియోగదారులకు అందుబాటులో ఉంది. 4జీబీ + 64జీబీ వేరియంట్‌ స్మార్ట్‌ఫోన్‌ ధర రూ. 12,999కు అందుబాటులో ఉంటుంది. ఇదే స్మార్ట్‌ఫోన్‌ని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి రూ.1,250 డిస్కౌంట్‌తో రూ. రూ. 11,749లకు పొందవచ్చు. అలాగే రూ. 2,559 సహా రీఛార్జ్‌పై 2000 క్యాష్‌బ్యాక్ విలువైన జియో ఆఫర్‌ ప్రయోజనాన్ని పొందవచ్చు. అలాగే జీ 5 వార్షిక సబ్‌స్క్రిప్షన్‌పై రూ.559 తగ్గింపు పొందవచ్చు. ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌ మినరల్ గ్రే, శాటిన్ సిల్వర్ అనే రెండు అద్భుతమైన రంగులలో అందుబాటులో ఉంటుంది.




Next Story