అద్భుతమైన ఫీచర్స్‌తో వ‌స్తున్న‌ మోటో జీ52.. ధ‌ర ఎంతంటే..

Motorola brings its Moto G52 to India. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిపొందిన, నమ్మకమైన బ్రాండ్‌గా పేరు తెచ్చుకుంది మోటోరోలా

By Medi Samrat  Published on  26 April 2022 12:47 PM GMT
అద్భుతమైన ఫీచర్స్‌తో వ‌స్తున్న‌ మోటో జీ52.. ధ‌ర ఎంతంటే..

ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిపొందిన, నమ్మకమైన బ్రాండ్‌గా పేరు తెచ్చుకుంది మోటోరోలా.. అయితే మోటోరోలా 'జీ' సిరీస్ కు మరో పవర్-ప్యాక్డ్ స్మార్ట్‌ఫోన్‌ను జోడించింది కంపెనీ. మోటో జీ-52 గా వ‌చ్చిన ఈ స్మార్ట్‌ఫోన్‌లో ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా అద్భుతమైన పనితీరుతో లోడ్ చేయబడిన స్మార్ట్‌ఫోన్ ఇది. ఇందులో విప్లవాత్మకమైన పోల్‌డ్‌ 90హెచ్‌జెడ్‌ ఎఫ్‌హెచ్‌డి+ డిస్‌ప్లే, స్పష్టమైన రంగులు, కాంట్రాస్ట్, గొప్ప వీక్షణ అనుభవం క‌లిగించే విధంగా రూపుదిద్దుకుంది. ఇది సాధారణ ఓఎల్‌ఈడీ /అమోల్‌డ్‌ డిస్ప్లేల కంటే ఎక్కువ మన్నికైనది. అత్యుత్తమ ఓఎల్‌ఈడీ సాంకేతికత దీని సొంతం. ఇవన్నీ మీకు ఇష్టమైన కంటెంట్‌కు జీవం పోయడానికి మీకు స‌హాయ‌ప‌డ‌తాయి.

మోటో జి-52 అత్యంత క్లిష్టమైన వివరాలతో రూపొందించబడింది. సొగసైన టచ్ అనుభూతిని ఇస్తుంది. 7.99 ఎమ్‌ఎమ్‌ సన్నగా, 169 గ్రాముల బరువుని కలిగి ఉంటుంది. ఇన్ని అద్భుతమైన ఫీచర్స్‌.. ఈ సెగ్మెంట్‌లో అందుబాటులో ఉన్న స్మార్ట్‌ఫోన్‌ ఇదొక్కటే కావ‌డం విశేషం. డాల్బీ అట్మోస్‌తో కూడిన స్టీరియో స్పీకర్స్‌, ఆండ్రాయిడ్‌ 12 లాంటి మరెన్నో అద్భుతమైన ఫీచర్స్ కూడా ఈ మొబైల్ లో ఉన్నాయి. ఐపీ 52 వాటర్ రిపెల్లెంట్ డిజైన్‌, మైక్రో ఎస్‌డి కార్డ్, సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్‌, క్యారియర్ అగ్రిగేషన్, 2x2 మిమో, ఎన్‌ఎఫ్‌సీతో అత్యుత్తమ-ఇన్-క్లాస్ కనెక్టివిటీ త‌దిత‌ర ఫీచ‌ర్లు ఈ ఫోన్‌లో అందుబాటులో ఉన్నాయి.

ఈ స్మార్ట్ ఫోన్‌ రూ.13,999లకు ఫ్లిప్‌కార్ట్,ప్రముఖ రిటైల్ స్టోర్‌లలో చార్‌కోల్ గ్రే, పోర్సిలైన్ వైట్ అనే రెండు ఆకట్టుకునే కలర్ వేరియంట్‌లలో మే 3వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు అమ్మకానికి సిద్ధంగా ఉంటుంది.

Next Story