డిసెంబర్ 10న భారత్ లో మోటో జి51 మొబైల్ ఫోన్ లాంఛ్.. ప్రత్యేకతలు ఏమిటంటే..!
Moto G51 may launch in India on December 10. మోటరోలా కంపెనీ భారత్ లో Moto G51 ఫోన్ ని విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది
By Medi Samrat Published on 4 Dec 2021 1:14 PM GMTమోటరోలా కంపెనీ భారత్ లో Moto G51 ఫోన్ ని విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. Moto G51ని డిసెంబర్ 10న భారతదేశంలో ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది. Moto G51 భారతదేశంలో లాంచ్ చేస్తే, Qualcomm Snapdragon 480 SoC ప్లస్‌తో వస్తున్న మొదటి మోటరోలా స్మార్ట్‌ఫోన్ అవుతుంది. Motorola స్మార్ట్‌ఫోన్ రాకను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు, అయితే Moto G51 డిసెంబర్ 10న భారతదేశంలో ఆవిష్కరించబడుతుందని కొందరు టెక్ నిపుణులు ట్వీట్ చేశారు. స్మార్ట్‌ఫోన్ 8GB వేరియంట్‌లో 128GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్‌ను కంపెనీ మిడ్‌రేంజ్ లో రాబోతున్న మంచి ఫోన్ అని చెబుతున్నారు.
Moto G51 ధర మరియు స్పెసిఫికేషన్‌లను తెలుసుకుందాం :
Moto G51 భారతదేశంలో రూ. 19,999 ధరతో వస్తుందని భావిస్తూ ఉన్నారు. చైనాలో సింగిల్ 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ కోసం స్మార్ట్‌ఫోన్ ధర CNY 1,499 (దాదాపు రూ. 17,500)గా నిర్ణయించబడింది. ఈ స్మార్ట్‌ఫోన్ బ్లూ, గ్రే రంగులతో రానుంది. Moto G51 6.8-అంగుళాల హోల్-పంచ్ LCD స్క్రీన్ ని కలిగి ఉంది. స్మార్ట్‌ఫోన్ 2.2GHz Qualcomm Snapdragon 480+ SoC ద్వారా 8GB RAM మరియు 128GB నిల్వతో జత చేయబడింది. దీనిని మైక్రో SD కార్డ్‌ని ఉపయోగించి విస్తరించవచ్చు.
కెమెరా పరంగా, Moto G51 వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది, ఇందులో 50-మెగాపిక్సెల్ S5JKN1 ప్రైమరీ సెన్సార్, 8-మెగాపిక్సెల్ మరియు 2-మెగాపిక్సెల్ సెన్సార్ కూడా ఉన్నాయి. Moto G51 10W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది డాల్బీ అట్మాస్ సపోర్టుతో వస్తుంది. కనెక్టివిటీ కోసం 5G సపోర్ట్, Wi-Fi 5, బ్లూటూత్ v5.2, GPS, USB టైప్-C పోర్ట్ మరియు 3.5mm ఆడియో జాక్‌తో వస్తుంది. స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది.