భారతదేశంలో విడుదలైన Moto G31 స్మార్ట్‌ఫోన్.. ధర ఎంతంటే..?
Moto G31 Smartphone Launched for Rs 12999 In India. మోటరోలా కంపెనీ మరో మాంచి ఫీచర్లు ఉన్న మీడియం రేంజ్ స్మార్ట్ ఫోన్ ను భారత
By Medi Samrat Published on 29 Nov 2021 3:09 PM ISTమోటరోలా కంపెనీ మరో మాంచి ఫీచర్లు ఉన్న మీడియం రేంజ్ స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్లోకి వదిలింది. మీడియాటెక్ ప్రాసెసర్, వెనుక ట్రిపుల్ కెమెరా యూనిట్, 5,000mAh బ్యాటరీతో కొత్త స్మార్ట్‌ఫోన్ 'Moto G31'ని సోమవారం నాడు విడుదల చేసింది. భారతదేశంలో స్మార్ట్‌ఫోన్ ధర 4GB RAM+64GB స్టోరేజ్ ఆప్షన్‌కు రూ.12,999 నిర్ణయించగా.. 6GB RAM+128GB స్టోరేజ్ ఆప్షన్‌కు రూ.14,999 ధరను నిర్ణయించారు. ఈ మొబైల్ ఫోన్ బ్లోట్‌వేర్-రహితంగా Motorola కంపెనీ తీసుకుని వచ్చిందని.. భద్రత విషయంలో మెరుగైన రక్షణను అందిస్తుందని సంస్థ మొబైల్ లాంఛ్ సమయంలో తెలిపింది.
ఫీచర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్‌ఫోన్ 60Hz రిఫ్రెష్ రేట్ మరియు 20:9 యాస్పెక్ట్ రేషియోతో 6.4-అంగుళాల పూర్తి-HD+ (1,080x2,400 పిక్సెల్‌లు) OLED హోల్-పంచ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 11 స్టాక్ సాఫ్ట్‌వేర్‌పై నడుస్తుంది. హైబ్రిడ్ డ్యూయల్ సిమ్ స్లాట్ (నానో+ నానో/మైక్రో SD)ని కలిగి ఉంది. Arm Mali-G52 MC2 GPUతో జత చేయబడిన MediaTek Helio G85 SoC మరియు 6GB వరకు RAM, 128GB అంతర్గత నిల్వతో అందించబడుతుంది.
Moto G31లో 50MP ప్రధాన సెన్సార్, 8MP వైడ్ యాంగిల్ కెమెరా మరియు 2MP మాక్రో సెన్సార్ ఉన్నాయి. వెనుక కెమెరా మోడ్‌లలో డ్యూయల్ క్యాప్చర్, స్పాట్ కలర్, నైట్ విజన్, పోర్ట్రెయిట్ వంటివి ఉన్నాయి. ముందు భాగంలో 13MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. స్మార్ట్‌ఫోన్ 20W టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీతో వచ్చింది. కనెక్టివిటీ ఎంపికలలో 4G LTE, FM రేడియో, 3.5mm ఆడియో జాక్, బ్లూటూత్ v5, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi 802.11 ac, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి.