మరిన్ని చిక్కుల్లో ఓలా
ఎలక్ట్రిక్ వాహనాల (EV) తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ ఇబ్బందుల్లో పడింది.
By Medi Samrat Published on 8 Oct 2024 9:52 PM IST
ఎలక్ట్రిక్ వాహనాల (EV) తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ ఇబ్బందుల్లో పడింది. ఓలా బైక్ లకు సంబంధించి భారీగా పెరిగిపోతున్న ఫిర్యాదుల కారణంగా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. అయితే రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) ఓలా సర్వీస్, కార్యకలాపాలకు సంబంధించిన ఫిర్యాదులను పరిశోధించడానికి ముందుకు వచ్చింది.
కస్టమర్ల నుండి పెరుగుతున్న ఆందోళనలను పరిష్కరించడానికి ఓలా ఎలక్ట్రిక్ నుండి వివరణాత్మక నివేదికను కోరుతూ రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) ఈ వారం అధికారిక విచారణను ప్రారంభించనుంది. Ola ఎలక్ట్రిక్ పై ఇటీవలి నెలల్లో ఫిర్యాదులు పెరుగుతున్నాయి. సర్వీసుల్లో సరైన నాణ్యత లేకపోవడం, కస్టమర్ సపోర్ట్ సరిగా లేకపోవడం లాంటి సమస్యలు చాలా ఎక్కువయ్యాయి. ఈ ఫిర్యాదులు MoRTH దృష్టిని ఆకర్షించింది. భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న EV మార్కెట్‌లో సరైన ప్రమాణాలు లేకుండా ఎలక్ట్రిక్ వాహనాలను అమ్మడం కరెక్ట్ కాదంటూ ఓలాను మంత్రిత్వ శాఖ ప్రశ్నించే అవకాశం ఉంది.