రూ.1000కే మినీ ఏసీ.. ఎక్కడో తెలుసా?

ముంబైకి చెందిన ఓ షాప్‌ యాజమాని రూ.వెయ్యికే మినీ ఏసీలను విక్రయిస్తున్నాడు. చిన్న సైజ్‌లో ఉన్న ఈ ఏసీ చాలా తక్కువ ధరకే వస్తుండటంతో చాలా మంది కొనుగోలు చేస్తున్నారు.

By అంజి
Published on : 21 April 2025 8:29 AM IST

Mini AC, Summer, AC, AirConditioners, Heatwave, Mumbai, India

రూ.1000కే మినీ ఏసీ.. ఎక్కడో తెలుసా?

దేశ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ఉక్కపోత, వేడి గాలులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. బయటకు రావాలంటేనే జంకుతున్న ప్రజలు.. ఇళ్లలో ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ మండే వేడికి అందరూ చల్లదనం కోరుకుంటారు. మరీ ఈ చల్లదనం కోసం ఏసీ కొనడం అందరికీ సాధ్యం కాదు, కూలర్ కూడా జేబుకు భారం లాంటిదే. ఇలాంటి పరిస్థితిలో మార్కెట్లో కేవలం రూ.1000కే మినీ ఏసీ దొరికితే ఎలా ఉంటుంది. అవును కొత్తగా మార్కెట్‌లోకి రూ.1000కే మినీ ఏసీ విక్రయిస్తున్నారు.

ముంబైకి చెందిన ఓ షాప్‌ యాజమాని రూ.వెయ్యికే మినీ ఏసీలను విక్రయిస్తున్నాడు. చిన్న సైజ్‌లో ఉన్న ఈ ఏసీ చాలా తక్కువ ధరకే వస్తుండటంతో చాలా మంది కొనుగోలు చేస్తున్నారు. అయితే ఇవి సాధారణ ఏసీల స్థాయిలో పని చేయవని, రూమ్‌కు సరిపడా చల్లదనాన్ని ఇస్తాయని యజమాని అంటున్నారు. చౌక ధరకే వస్తుండటంతో ఇది కొన్ని నెలలు పని చేసినా మేలేనని చెబుతున్నారు. మినీ ఏసీ ఒక చిన్న పోర్టబుల్ కూలింగ్ పరికరం. దీనిని టేబుల్ లేదా బెడ్ దగ్గర ఉంచవచ్చు. ఇది USB కేబుల్ ద్వారా ల్యాప్‌టాప్, పవర్ బ్యాంక్ లేదా విద్యుత్తుకు అనుసంధానించబడి ఉంటుంది. ఈ పరికరం ప్రధానంగా ఫ్యాన్, నీటి పాత్ర, బ్లోవర్ కలయికపై పనిచేస్తుంది. అంటే అది గాలిని నీటితో కలిపి కొద్దిగా చల్లబరచడానికి ప్రయత్నిస్తుంది.

నిజం చెప్పాలంటే.. ఇది ఏసీ కాదు, కూలింగ్ ఫ్యాన్. నిజమైన ఏసీ (ఎయిర్ కండిషనర్) గాలిని చల్లబరచడానికి కంప్రెసర్, గ్యాస్, కూలింగ్ సిస్టమ్‌ను ఉపయోగిస్తుంది. కానీ ఈ మినీ ఏసీ గాలిని తేమ చేయడం ద్వారా కొంచెం చల్లగా కనిపించేలా చేస్తుంది, ఇది కొన్ని అంగుళాల వ్యాసార్థంలో మాత్రమే ప్రభావవంతంగా ఉంటుంది. విద్యుత్ వినియోగం తక్కువగా ఉంటుంది కానీ చల్లదనం కూడా తక్కువగా ఉంటుంది.

Next Story