'మెటా' నుంచి సరికొత్త స్మార్ట్‌ వాచ్‌.. లాంచింగ్‌ ఎప్పుడంటే..!

Meta plans to launch smart watch. ప్రముఖ సోషల్‌ మీడియా దిగ్గజం 'ఫేసుబుక్‌' మాతృసంస్థ పేరును 'మెటా'గా మార్చిన విషయం తెలిసిందే. ఇప్పుడె మెటాగా పేరు

By అంజి  Published on  30 Oct 2021 12:39 PM GMT
మెటా నుంచి సరికొత్త స్మార్ట్‌ వాచ్‌.. లాంచింగ్‌ ఎప్పుడంటే..!

ప్రముఖ సోషల్‌ మీడియా దిగ్గజం 'ఫేసుబుక్‌' మాతృసంస్థ పేరును 'మెటా'గా మార్చిన విషయం తెలిసిందే. ఇప్పుడె మెటాగా పేరు మారిన ఫేసుబుక్‌ కంపెనీ నుండి సరికొత్త స్మార్ట్‌వాచ్‌ రాబోతుంది. రౌండెడ్‌ స్క్రీన్‌, ఫ్రంట్‌ ఫేసింగ్‌ కెమెరా ఈ కొత్త స్మార్ట్‌ వాచ్‌ స్పెషల్. ఇక ఇది స్మార్ట్‌ఫోన్లకు ముందు భాగంలో కెమెరా ఉన్నట్టే.. దీనికి కూడా ఫ్రంట్‌లో కెమెరా ఉండనుంది. యాపిల్‌ వాచ్‌ను మించేలా మెటాకు ఈ స్మార్ట్‌ వాచ్‌ ఉండనుంది. ఈ స్మార్ట్‌వాచ్‌ను కర్వ్‌ షేప్‌లో ఎడ్జ్‌, వాచ్‌ కుడి వైపు కంట్రోల్‌ బటన్‌ లాంటి ఫీచర్లు ఉండనున్నాయి.

మెటా ఈ వాచ్‌ను 2022 సంవత్సరంలో లాంచ్‌ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇటీవల ఫేసుబుక్‌ రేబాన్‌ సాయంతో స్మార్ట్‌ గ్లాసెస్‌ను రిలీజ్‌ చేసింది. అయితే ఆ స్మార్ట్‌ గ్లాసెస్‌ను కొత్తగా వచ్చే స్మార్ట్‌ వాచ్‌తో కంట్రోల్‌ చేయవచ్చు. వర్చువల్‌ రియాల్టీ హెడ్‌సెట్స్‌, పోర్టల్‌ వీడియో చాట్‌ డివైజ్‌లను మెటా ప్రస్తుతం అమ్ముతోంది. కొత్తగా లాంచ్‌ అయ్యే స్మార్ట్‌వాచ్‌ను మెటాకు చెందిన అన్ని డివైజ్‌లను ఆపరేటెట్‌ చేసేలా రూపొందిస్తున్నారు. స్మార్ట్‌ వాచ్‌తో హెడ్‌సెట్స్‌ను కూడా ఆపరేట్‌ చేయొచ్చు.

Next Story