ఉపశమనం.. వాణిజ్య సిలిండర్ ధర తగ్గింపు

చమురు మార్కెటింగ్ కంపెనీలు మే నెల‌ మొదటి రోజున ఎల్‌పిజి సిలిండర్ ధరను సవరించాయి. దీంతో కొత్త సిలిండర్ ధరలు నేటి నుంచి అమలులోకి రానున్నాయి

By Medi Samrat  Published on  1 May 2024 7:46 AM IST
ఉపశమనం.. వాణిజ్య సిలిండర్ ధర తగ్గింపు

చమురు మార్కెటింగ్ కంపెనీలు మే నెల‌ మొదటి రోజున ఎల్‌పిజి సిలిండర్ ధరను సవరించాయి. దీంతో కొత్త సిలిండర్ ధరలు నేటి నుంచి అమలులోకి రానున్నాయి. దేశంలో లోక్‌సభ ఎన్నికలకు ఓటింగ్ జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మరోసారి సిలిండర్ ధరలు తగ్గాయి. వాణిజ్య సిలిండర్ ధరను చమురు కంపెనీలు రూ.19 తగ్గించాయి. దీంతో కమర్షియల్ సిలిండర్ ధరలు వరుసగా రెండో నెల కూడా తగ్గాయి.

వాణిజ్య సిలిండర్లపై మాత్రమే ఈ తగ్గింపు జరిగింది. డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. వాణిజ్య సిలిండర్ల కొత్త రేట్లు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. అంటే ఈరోజు సిలిండర్ ఆర్డర్ చేస్తే కొత్త రేట్లకే సిలిండర్ వస్తుంది.

రాజధాని ఢిల్లీలో వాణిజ్య సిలిండర్ ధర రూ.1764.50గా ఉంది. నేటి నుంచి ధర రూ.1745.50గా మారింది.

కోల్‌కతాలో వాణిజ్య సిలిండర్ ధర రూ.1,879 నుంచి రూ.1,859కి తగ్గింది.

ముంబైలో వాణిజ్య సిలిండర్ ధర రూ.1717.50. రూ.1698కి తగ్గింది.

ఈరోజు నుండి చెన్నైలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.1,911.00.

ఈసారి కూడా డొమెస్టిక్ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదు. డొమెస్టిక్ సిలిండర్ రూ.803కే అందుబాటులో ఉంటుంది. ఫిబ్రవరి 1న మహిళా దినోత్సవం సందర్భంగా డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.14 తగ్గింది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారుల‌కు రూ.603కే డొమెస్టిక్ సిలిండర్ అందుతుంది. పీఎం ఉజ్వల యోజన లబ్ధిదారులు ఏడాదికి 12 సిలిండర్లపై సబ్సిడీ ప్రయోజనం పొందుతారు. ఈ పథకం 2016 సంవత్సరంలో ప్రారంభమైంది. ఈ పథకం వ్యవధి మార్చి 2024లో ముగియాల్సి ఉండగా.. క్యాబినెట్ ఇప్పుడు దాని వ్యవధిని మార్చి 31, 2025 వరకు పొడిగించింది.

Next Story