రిచ్ మ్యాన్ జెఫ్ బెజోస్‌ను దాటిన కొత్త కుబేరుడు.. సంపద ఎంతంటే..
Louis Vuitton chief Bernard Arnault overtakes Jeff Bezos. ప్రపంచ నెంబర్ వన్ సంపన్నుడిగా ప్రముఖ లగ్జరీ గూడ్స్ లూయిస్ విట్టన్ మోయెట్ హెన్నెస్సీ
By Medi Samrat Published on 7 Aug 2021 5:20 PM GMT
ప్రపంచ నెంబర్ వన్ సంపన్నుడిగా ప్రముఖ లగ్జరీ గూడ్స్ లూయిస్ విట్టన్ మోయెట్ హెన్నెస్సీ(ఎల్‌వీఎమ్‌హెచ్) కంపెనీ అధినేత బెర్నార్డ్ ఆర్నాల్డ్ అవతరించాడు. దీంతో ప్రపంచ కుబేరుల జాబితాలో తాజాగా మొదటి స్థానం నుంచి జెఫ్‌బెజోస్ వైదొలిగాడు. ఫోర్బ్స్ విడుదల చేసిన రియల్ టైమ్ బిలియనీర్స్ జాబితా ప్రకారం ఆర్నాల్ట్ మొత్తం నికర ఆస్తుల విలువ 198.9 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. ఇక ఇప్పటివరకూ మొదటిస్థానంలో ఉన్న జెఫ్ బెజోస్ రెండో స్థానానికి పడిపోగా అతని సంపద 194.9 బిలియన్ డాలర్లు ఉంటుందని ఫోర్బ్స్ పేర్కొంది. మూడో స్థానంలో స్పెస్ ఎక్స్, టెస్లా అధినేత ఎలన్ మస్క్ 185. 5 బిలియన్ల డాలర్లతో ఉన్నారు.
ఇదిలావుంటే.. బెర్నార్డ్ ఆర్నాల్డ్ అంతకు ముందు డిసెంబర్ 2019, జనవరి 2020, మే 2021 లో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచాడు. తాజాగా మరోసారి ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా అవతరించాడు. ఎల్‌వీఎమ్‌హెచ్ కంపెనీ ఈ ఏడాది మొదటి మూడు నెలలలో 14 బిలియన్ యూరోలను ఆర్జించింది. ఆ సమయంలో ఆర్నాల్డ్.. ఎలన్ మస్క్ స్థానాన్ని దాటాడు. ఎల్‌వీఎమ్‌హెచ్ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 70 బ్రాండ్‌లను కలిగింది. లూయిస్ విట్టన్, సెఫోరా, టిఫనీ అండ్ కో, స్టెల్లా, మాక్కార్ట్నీ, గూచీ, క్రిస్టియన్ డియోర్, గివెన్చీ బ్రాండ్‌లను కలిగి ఉంది.