ఫాదర్స్ డే సందర్భంగా Koo యాప్ స‌రికొత్త క్యాంపెయిన్‌

Koo app coming up with the latest campaign on the occasion of Father's Day. ఫాదర్స్ డే సందర్భంగా పితృత్వ స్ఫూర్తికి వందనం చేస్తూ Koo యాప్

By Medi Samrat
Published on : 18 Jun 2022 6:09 PM IST

ఫాదర్స్ డే సందర్భంగా Koo యాప్ స‌రికొత్త క్యాంపెయిన్‌

ఫాదర్స్ డే సందర్భంగా పితృత్వ స్ఫూర్తికి వందనం చేస్తూ Koo యాప్ #PapaKiLoveLanguage అనే ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ ప్రచారం తండ్రి, పిల్లల మధ్య ఉన్న‌ ప్రేమ, ఆప్యాయతను తెలియ‌జేస్తుంది. వినియోగదారులు తమ తండ్రుల పట్ల ఉన్న‌ ప్రేమను బహిరంగంగా వ్యక్తీకరించడానికి ఈ టాగ్ ను వాడొచ్చు. కూ యాప్‌ #PapaKiLoveLanguage క్యాంపెయిన్ ద్వారా వినియోగదారులు పితృత్వ స్ఫూర్తికి సంబంధించిన కథనాలు, చిన్న కథలు, ఫోటోలు, మీమ్‌లు, వీడియోల ద్వారా ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను పంచుకోవడానికి ప్రోత్సహిస్తుంది.

దీంతో వినియోగదారులు తమ తండ్రి యొక్క సూపర్ హీరో క్షణాలను గుర్తుచేసుకోగలరు. త‌ద్వారా పిల్ల‌లు కూడా తండ్రుల‌ పట్ల శ్రద్ధ వహిస్తున్నార‌ని గుర్తు చేయడంతో పాటు.. అతనిపై తమ‌ ప్రేమను కురిపించవ‌చ్చ‌ని తెలిపింది. ఈ కాంపెయిన్లో భాగంగా.. ప్రత్యేక కవితల పోటీని కూడా ప్రారంభించింది. కవిత్వం ద్వారా తమ తండ్రికి కృతజ్ఞతలు తెలియజేయండని పేర్కొంది. ఇక‌ Koo App ఇప్ప‌టికే అనేక భాషలలో సృష్టిని చురుకుగా భాగస్వామ్యం చేసే కవుల యొక్క కమ్యూనిటీని కలిగి ఉంది.

Koo App యొక్క ప్రతినిధి మాట్లాడుతూ.. "చాలా మంది భారతీయ తండ్రులు తమ ప్రేమను సాధారణ పదాలలో వ్యక్తపరచకపోయినా.. వారికి పిల్లల పట్ల ఉన్న‌ ప్రేమ భరోసాను ఇస్తుంది. తరచుగా తండ్రి, పిల్లల మధ్య సంబంధాన్ని నిర్వచించే ఎన్నో వీడియోలు, క‌థ‌నాలు చూస్తుంటాం. Koo యాప్ ఒక సోషల్ ప్లాట్‌ఫారమ్‌గా ఒక ప్రత్యేకమైన కమ్యూనిటీని సృష్టించింది, ఇక్కడ వినియోగదారులు తమకు నచ్చిన భాషలో స్వేచ్ఛగా త‌మ భావాన్ని వ్యక్తీకరించవచ్చు. వారి జీవితంలోని ఉత్తమ క్షణాలను సెల‌బ్రేట్ చేసుకోవ‌చ్చు. #PapaKiLoveLanguage ద్వారా తమ తండ్రుల పట్ల ఉన్న‌ ప్రేమను తెల‌పండ‌ని వినియోగదారుల‌ను మేము ఆహ్వానిస్తున్నాము. ఈ సంద‌ర్భంగా తండ్రులు, కాబోయే తండ్రులందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.













Next Story