ఏప్రిల్ 22న అక్షయ తృతీయ పండుగ ఉంది. హిందువులకు ఈ పండుగ ఎంతో ముఖ్యమైనది. ఈ పండుగ వైశాఖ మాసం శుక్ల పక్షం మూడవ రోజున జరుపుకుంటారు. ఈ రోజున భగవంతుడు పరశురాముడు జన్మించాడని, గంగామాత భూమిపై అవతరించిందని నమ్ముతారు. ఈ కారణంగా ఈ రోజు ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఈ రోజంతా శుభప్రదమని, ఏ పని చేయాలన్నా శుభ ముహూర్తాలు చూడాల్సిన అవసరం లేదని చెబుతారు. ఈ కారణం చేత అక్షయ తృతీయ నాడు బంగారం కొనడం శుభప్రదంగా భావిస్తారు.
అందుకే మహిళలు పెద్ద సంఖ్యలో బంగారం, గోల్డ్ కాయిన్స్ కొనుగోలు చేస్తారు. బంగారం నాణేలు కొనుగోలు చేసేటప్పుడు మీరు తప్పనిసరిగా కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. గోల్డ్ కాయిన్‌ను కొనుగోలు చేసేటప్పుడు మీరు ఎక్కడ కొనుగోలు చేస్తున్నారో గమనించండి. ఎందుకంటే ప్రస్తతం.. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ జ్యువెలర్స్ కాకుండా.. ఆన్‌లైన్ యాప్‌ల వంటి అనేక చోట్ల గోల్డ్ కాయిన్స్ అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. అందువల్ల మీరు బంగారు నాణెం కొనుగోలు చేసేందుకు అనువైన స్థలాన్ని జాగ్రత్తగా ఎంచుకోవాలి. లేదంటే మోసపోతారు.
బంగారు నాణెం కొనుగోలు చేసేటప్పుడు.. బంగారం ఎన్ని క్యారెట్లలో ఉందో కనుక్కోండి. కొన్నిసార్లు స్వర్ణకారులు బంగారు నాణెం మన్నికను పెంచడానికి జింక్, వెండి వంటి లోహాలను జోడిస్తారు. బంగారు నాణెంపై ఉండే హాల్‌మార్క్ స్వచ్ఛతకు ప్రతీక. ఏప్రిల్ 1, 2023 తర్వాత హాల్‌మార్క్ లేకుండా బంగారం కొనడం శిక్షార్హమైన నేరం. బంగారు నాణేల ప్యాకేజింగ్‌పై కూడా శ్రద్ధ వహించండి. కొన్నిసార్లు మోసపోయే అవకాశం ఉంటుంది. ఇవన్ని.. పాటించి జాగ్రత్తలు పాటిస్తేనే.. బంగారు నాణెం తిరిగి విక్రయించేటప్పుడు మీరు అధిక ధరను పొందుతారు.