వంద మిలియన్ల సబ్‌స్క్రైబర్‌ల సంఖ్య దాటిన జియోహాట్‌స్టార్

భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే ఒక అద్భుతమైన విజయంలో భాగంగా జియోహాట్‌స్టార్ 100 మిలియన్ల సబ్‌స్క్రైబర్‌ల సంఖ్యను అధిగమించింది.

By Medi Samrat
Published on : 28 March 2025 4:30 PM IST

వంద మిలియన్ల సబ్‌స్క్రైబర్‌ల సంఖ్య దాటిన జియోహాట్‌స్టార్

భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే ఒక అద్భుతమైన విజయంలో భాగంగా జియోహాట్‌స్టార్ 100 మిలియన్ల సబ్‌స్క్రైబర్‌ల సంఖ్యను అధిగమించింది. భారతదేశంలోని విభిన్న ప్రేక్షకులను అర్థం చేసుకోవడంలో , వారికి సేవ చేయడంలో జియోహాట్‌స్టార్ యొక్క అచంచలమైన నిబద్ధతకు ఈ చారిత్రాత్మక ఘనత ఒక అద్భుతమైన నిదర్శనం. భారతదేశంలో స్ట్రీమింగ్‌ను విప్లవాత్మకంగా మారుస్తూ , ఎంపిక చేసిన కొద్దిమందికి ప్రీమియం సేవ గా అనే భావనను తొలగిస్తూ లక్షలాది మందికి రోజువారీ జీవితంలో అంతర్భాగంగా స్ట్రీమింగ్‌ ను మార్చింది. ప్రత్యేకమైన ఉచిత-వీక్షణ నమూనా ప్రతిపాదన, ఆలోచనాత్మక సబ్‌స్క్రిప్షన్ ధరల వ్యూహం మరియు ప్రముఖ టెలికాం ప్రదాతలతో లోతైన భాగస్వామ్యాలు, లభ్యతను సర్వవ్యాప్తం చేయడంతో పాటుగా కంటెంట్‌ను విస్తృతంగా ఎలా ఆస్వాదించాలో చూపుతో జియోహాట్‌స్టార్ కొత్త ప్రమాణాలను నిర్దేశించింది.

ఈ మైలురాయి గురించి జియోస్టార్, డిజిటల్ - సీఈఓ , కిరణ్ మణి మాట్లాడుతూ, “ప్రపంచ స్థాయి వినోదం అందరికీ అందుబాటులో ఉండాలని మేము ఎల్లప్పుడూ నమ్ముతుంటాము. ఇప్పుడు 100 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్‌ల సంఖ్యను దాటడం ఆ నమ్మికకు నిదర్శనం. ఈ మైలురాయి భారతదేశం యొక్క అపరిమిత సామర్థ్యాన్ని నొక్కి చెప్పడమే కాకుండా, అపూర్వమైన స్థాయిలో కేటగిరీ-ఫస్ట్ అనుభవాలను అందించాలనే మా నిబద్ధతను మరింతగా వెల్లడిస్తోంది . మేము ఆవిష్కరణలు , విస్తరణను కొనసాగిస్తున్న వేళ , స్ట్రీమింగ్ యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దడం , అందరికి దానిని చేరువ చేయటం , బిలియన్ స్క్రీన్‌లకు అనంతమైన అవకాశాలను అందించటం పై మా దృష్టి కొనసాగుతుంది” అని అన్నారు.

ఈ వేగంకు శక్తినిచ్చే అత్యంత కీలకమైన అంశంగా , ప్రపంచంలోని అత్యంత లోతైన , వైవిధ్యమైన అవకాశాలలో వినోదం ఒకటిగా నిలుస్తుంది. ప్రపంచంలో ఎక్కడ నుంచైనా టీవీ షోలను చూసే విస్తృత అవకాశాల నుండి, ప్రపంచంలో ఎక్కడైనా సరే ఒకే ప్లాట్‌ఫామ్‌లో లభించే హాలీవుడ్ వినోదం యొక్క విస్తృత అవకాశాల వరకు, పలు భాషలలో విభిన్నమైన డిజిటల్ స్పెషల్స్ , స్క్రిప్ట్ చేయని/రియాలిటీ షోల క్యాలెండర్ నుంచి , ఇటీవల ప్రారంభించబడిన స్పార్క్స్ వరకు, భారతదేశంలోని అత్యంత ప్రజాదరణ పొందిన క్రియేటర్లను హైలైట్ చేస్తూ - భారతదేశ డిజిటల్ ల్యాండ్‌స్కేప్‌లో ఇప్పటివరకు సమీకరించబడిన అత్యంత విస్తృతమైన కంటెంట్ విశ్వాన్ని జియోహాట్‌స్టార్ నిర్మించింది.

ప్రతి అభిమానికి లీనమయ్యే, ఇంటరాక్టివ్ అనుభవాలతో భారతదేశంలో స్పోర్ట్స్ స్ట్రీమింగ్‌ను జియోహాట్‌స్టార్ పునరావిష్కరించింది. ఐసీసీ ఈవెంట్స్, ఐపీఎల్, డబ్ల్యుపీఎల్ వంటి ప్రీమియర్ టోర్నమెంట్లకు నిలయంగా ఉండటంతో పాటు, జియోహాట్‌స్టార్ ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ ద్వారా ప్రాధమిక స్థాయి క్రికెట్‌ కు కూడా మద్దతు అందించింది. ప్రీమియర్ లీగ్ , వింబుల్డన్‌తో ప్రపంచ క్రీడా నైపుణ్యాన్ని తమ వేదిక వద్దకు తీసుకువచ్చింది. అదే సమయంలో ప్రో కబడ్డీ , ఐఎస్‌ఎల్ వంటి దేశీయ లీగ్‌లను శక్తివంతం చేసింది. అల్ట్రా-హెచ్‌డి 4కె స్ట్రీమింగ్, ఏఐ ఆధారిత పరిజ్ఙానం , రియల్-టైమ్ స్టాట్స్ ఓవర్‌లేస్, లైవ్ చాట్స్, మల్టీ-యాంగిల్ వ్యూయింగ్ మరియు విప్లవాత్మక వాయిస్-అసిస్టెడ్ నావిగేషన్ వంటి అత్యాధునిక స్ట్రీమింగ్ ఫీచర్‌లతో, జియోహాట్‌స్టార్ భారతదేశంలో క్రీడానుభవాన్ని సమూలంగా మార్చింది, ఇప్పటివరకు అతిపెద్ద ఐసీసీ పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీ 2025ను అందించింది, మహిళల ప్రీమియర్ లీగ్‌తో సమగ్రతను సాధించింది . టాటా ఐపీఎల్ 2025తో కొత్త ప్రమాణాలను నెలకొల్పింది.

క్రీడలకు మించి లైవ్-స్ట్రీమింగ్ యొక్క సరిహద్దులను ముందుకు తీసుకువెళ్తూ , జియోహాట్‌స్టార్ వాస్తవ సమయ కార్యక్రమాలను లక్షలాది మందికి భాగస్వామ్య సాంస్కృతిక క్షణాలుగా మార్చింది. ఇది కోల్డ్‌ప్లే మ్యూజిక్ ఆఫ్ ది స్పియర్స్ కచేరీ లైవ్ స్ట్రీమ్‌లో మరియు మహాశివరాత్రి ఆధ్యాత్మిక దృశ్యం: ది డివైన్ నైట్‌లో స్పష్టంగా కనిపించింది, ఇది ప్రేక్షకులను భారతదేశం అంతటా 12 కి పైగా పవిత్ర జ్యోతిర్లింగ హారతులకు దగ్గరగా తీసుకువచ్చింది - సాంకేతికత, స్థాయి , భావోద్వేగాలను ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా మిళితం చేసింది.

జియోహాట్‌స్టార్ యొక్క 100 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్‌ల అపూర్వమైన మైలురాయి, ఒక అద్భుతం కంటే ఎక్కువ - ఇది భారతదేశ డిజిటల్ విప్లవం, కథనం యొక్క శక్తి మరియు స్ట్రీమింగ్ యొక్క భవిష్యత్తును ప్రతిబింబిస్తుంది.

Next Story