రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం మరో నిర్ణయం తీసుకుంది. కంపెనీ తన యూజర్లకు 18 నెలల పాటు ఉచితంగా గూగుల్ జెమిని ప్రో ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీన్ని మరింత విస్తరిస్తూ, జెమిని 3 మోడల్‌ను కూడా ఉచితంగా అందించాలని నిర్ణయించింది. నవంబర్ 19 నుంచి 5జీ యూజర్లందరికీ అందుబాటులో ఉంటుందని కంపెనీ అధికారిక ప్రకటనలో తెలిపింది. మొదట ఉచిత గూగుల్ ఏఐ ప్రో ఆఫర్‌ను 18-25 వయస్సు ఉన్న జియో వినియోగదారులకు పరిమితం చేసింది. తాజాగా గూగుల్, జియో భాగస్వామ్యాన్ని ప్రకటించిన తర్వాత జెమిని 3కి మారడం మొదటి ప్రధాన అప్‌గ్రేడ్ కానుంది. 18 నెలల ఉచిత సబ్‌స్క్రిప్షన్ సమయంలో జియో యూజర్లు ఏఐ ప్రో ప్లా కింద గూగుల్ అందించే అప్‌డేట్, ఇతర ఫీచర్లను ఆటోమేట్ పద్దతిలో యాక్సెస్ పొందుతారు. రూ. 35,100 విలువైన ఈ ప్లాన్ కోసం కస్టమర్ల్కు అన్‌లిమిటెడ్ 5జీ ప్లాన్‌ను యాక్టివేట్ చేసుకోవాలి.