జియో ఒక్క రూపాయి రీఛార్జ్.. ఇలా ట్విస్ట్ ఇచ్చిందేంటో..

Jio One Rupee Plan. రిలయన్స్ జియో అతి చవకైన కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను ఇటీవలే ప్రవేశపెట్టిన సంగతి తెలిసింది.

By Medi Samrat  Published on  17 Dec 2021 1:38 PM GMT
జియో ఒక్క రూపాయి రీఛార్జ్.. ఇలా ట్విస్ట్ ఇచ్చిందేంటో..

రిలయన్స్ జియో అతి చవకైన కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను ఇటీవలే ప్రవేశపెట్టిన సంగతి తెలిసింది. ఒక్క రూపాయి మాత్రమే ఖర్చు అయ్యే రీఛార్జ్ ఇది. 30 రోజుల చెల్లుబాటు కూడా ఉంటుంది. 1 రూపాయి ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ 30 రోజుల చెల్లుబాటు మరియు 100MB డేటాతో ఇటీవల విడుదల చేశారు. వినియోగదారులు పేర్కొన్న డేటాను వినియోగించిన తర్వాత, వారు 64Kbps ఇంటర్నెట్ బ్రౌజింగ్ వేగం పొందుతారు. Jio యొక్క కొత్త రీఛార్జ్ ప్లాన్ MyJio యాప్‌లోని ఇతర ప్లాన్‌ల క్రింద ఉన్న 'value' విభాగంలో చూడవచ్చు.

కేవలం ఒక రూపాయితో రీఛార్జ్‌ ప్లాన్‌ను ప్రకటించి సంచలనం సృష్టించిన రిలయన్స్‌ జియో.. కొన్ని గంటల్లోనే ఆ ఆఫర్‌లోని ప్రయోజనాలను మార్చింది. ఇంతకు ముందు ఒక్క రూపాయికి 100 ఎంబీ డేటాను ఇస్తూ ఉండగా.. ఇప్పుడు ఆ డేటాను 10ఎంబీకి కుదించింది. ప్లాన్‌ ద్వారా వచ్చే ప్రయోజనాలను కుదించి వినియోగదారులను ఒకింత నిరాశకు గురిచేసిందని చెప్పుకోవచ్చు. అయితే జియో కాకుండా దేశంలోని మరే ఇతర నెట్‌వర్క్ ప్రొవైడర్ కూడా ఇంత తక్కువ ధరలో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను అందించడం లేదు. ఒక రూపాయి రీఛార్జ్ చేసుకుంటే.. 10 ఎంబీ ప్రస్తుతం జియో తన వినియోగదారులకు అందిస్తూ ఉంది.


Next Story