ఎంగేజ్మెంట్ చేసుకున్న అదానీ కుమారుడు

Gautam Adani's son Jeet Adani gets engaged to Diva Jaimin Shah. పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ కుమారుడు జీత్ అదానీకి దివా జైమిన్ షాతో నిశ్చితార్థం జరిగింది.

By Medi Samrat
Published on : 14 March 2023 6:24 PM IST

ఎంగేజ్మెంట్ చేసుకున్న అదానీ కుమారుడు

Jeet Adani gets engaged to Diva Jaimin Shah


పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ కుమారుడు జీత్ అదానీకి దివా జైమిన్ షాతో నిశ్చితార్థం జరిగింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఈ నిశ్చితార్థానికి కేవలం సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. దివా వజ్రాల వ్యాపారి జైమిన్ షా కుమార్తె. ఈ నిశ్చితార్థం ప్రైవేట్ వేడుక. దీనికి సంబంధించి చాలా తక్కువ వివరాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

వారి నిశ్చితార్థ వేడుక నుండి అందుబాటులోకి వచ్చిన చిత్రాలలో వారు సాంప్రదాయ దుస్తులను ధరించారు. దివా ఎంబ్రాయిడరీ లెహంగాలో కనిపించింది. జీత్ పాస్టెల్ బ్లూ కుర్తా సెట్‌లో లైట్ హ్యూడ్ ఎంబ్రాయిడరీ జాకెట్‌ లో కనిపించాడు. జీత్ అదానీ యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ అప్లైడ్ సైన్సెస్ లో తన చదువును పూర్తి చేశాడు. అతను 2019లో అదానీ గ్రూప్‌లో చేరారు. ప్రస్తుతం అదానీ గ్రూప్ ఫైనాన్స్ కు వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు.


Next Story