ఈరోజు ఐటీఆర్ ఫైల్ చేయకపోతే ఏమవుతుంది?

ITR filing last date today What happens if you miss the deadline. 2023- 24 సంవత్సరానికి ఇన్‌ కమ్‌ ట్యాక్స్‌ రిటర్న్‌ (ఐటీఆర్‌) ఫైలింగ్‌ దాఖలు చేసేందుకు గడువు జులై 31తో ముగియనుంది.

By Medi Samrat
Published on : 31 July 2023 8:18 PM IST

ఈరోజు ఐటీఆర్ ఫైల్ చేయకపోతే ఏమవుతుంది?

2023- 24 సంవత్సరానికి ఇన్‌ కమ్‌ ట్యాక్స్‌ రిటర్న్‌ (ఐటీఆర్‌) ఫైలింగ్‌ దాఖలు చేసేందుకు గడువు జులై 31తో ముగియనుంది. గడువు పొడిగించాలంటూ వస్తున్న అభ్యర్థనలను ఆదాయపన్ను శాఖ తోసి పుచ్చింది. గడువు పొడిగించేది లేదని స్పష్టం చేసింది. అయితే గడువులోగా ట్యాక్స్ ఫైలింగ్ చేయని సందర్భాలలో ట్యాక్స్ పేయర్లకు ఆదాయపన్ను శాఖ మరో అవకాశం కల్పిస్తోంది. రూ.5 వేల ఆలస్య రుసుముతో డిసెంబర్ 31 వరకు దాఖలు చేసుకునే వెసులుబాటు ఉంది. ఆలస్య రుసుముతో పాటు చెల్లించే పన్నుపైనా వడ్డీ కట్టాల్సి వస్తుంది. పన్ను మొత్తంపై నెలకు ఒక్క శాతం వడ్డీ వసూలు చేయనున్నట్లు ఐటీ అధికారులు తెలిపారు.

ఒక్క రోజు ఆలస్యమైనా నెల రోజుల వడ్డీ చెల్లించాల్సిందే. రూ.5 లక్షలలోపు ఆదాయం ఉన్న ట్యాక్స్ పేయర్లు రూ.వెయ్యి చెల్లిస్తే సరిపోతుందని, రూ.3 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి ప్రాథమిక మినహాయింపు ఉంటుంది. ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయని వ్యక్తులు, సంస్థలు భవిష్యత్తులో ట్యాక్స్ మినహాయింపు పొందే అవకాశం కోల్పోతారని ఐటీ శాఖ అధికారులు తెలిపారు. హౌస్ ప్రాపర్టీతో పాటు ఇతర విభాగాల్లో పన్ను ఆదా చేసుకునే వీలుండదని, పన్ను రిటర్న్ దాఖలు చేయడంపై నిర్లక్ష్యానికి జరిమానాతో పాటు జైలుకు వెళ్లే పరిస్థితి కూడా ఎదురవుతుందని హెచ్చరించారు. చెల్లించాల్సిన పన్ను రూ.25 వేలు అంతకంటే ఎక్కువగా ఉంటే ఆరు నెలల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా పడే అవకాశం ఉందని అన్నారు అధికారులు.


Next Story