ఆ ఐఫోన్ మోడల్ పై ఏకంగా 25,000 రూపాయల డిస్కౌంట్.!

ఐఫోన్ 16 సిరీస్ త్వరలోనే అందుబాటులోకి రాబోతూ ఉండడంతో ఐఫోన్ 15 సిరీస్ ధరలు భారీగా తగ్గుతున్నాయి

By Medi Samrat  Published on  18 Sept 2024 3:30 PM IST
ఆ ఐఫోన్ మోడల్ పై ఏకంగా 25,000 రూపాయల డిస్కౌంట్.!

ఐఫోన్ 16 సిరీస్ త్వరలోనే అందుబాటులోకి రాబోతూ ఉండడంతో ఐఫోన్ 15 సిరీస్ ధరలు భారీగా తగ్గుతున్నాయి. ఐఫోన్ 15 ప్రో భారతదేశంలో అతి తక్కువ ధరకు రిలయన్స్ డిజిటల్‌లో అందుబాటులో ఉంది. ఎటువంటి నిబంధనలు, షరతులు లేకుండా రూ. 25,000 ఫ్లాట్ తగ్గింపు ఆఫర్‌ను ఇస్తోంది. ఐఫోన్ 15 ప్రో రిలయన్స్ డిజిటల్ స్టోర్‌లో రూ. 1,09,900కి లభించనుంది. అసలు ప్రారంభ ధర రూ. 1,34,900 కంటే తక్కువగా ఉంది. అంటే ఆ ప్లాట్‌ఫారమ్ లో వినియోగదారులకు రూ.25,000 ఫ్లాట్ తగ్గింపును ఇస్తోంది. ఈ డీల్ iPhone 15 Pro బ్లూ టైటానియం మోడల్‌ పై మాత్రమే ఉంది. అంతేకాకుండా కొన్ని అదనపు బ్యాంక్ ఆఫర్‌లు, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లు కూడా ఉన్నాయి.

ఇక ఐఫోన్ 16 సిరీస్ త్వరలోనే భారతదేశంలో అందుబాటులోకి రానుంది. ఐఫోన్ 16 ప్రో ధర భారతదేశంలో రూ. 1,19,900 నుండి ప్రారంభమవుతుంది. కొత్త వెర్షన్‌లో కొత్త అల్ట్రా-వైడ్ కెమెరా, శక్తివంతమైన చిప్, బ్యాటరీ పవర్, స్క్రీన్ సైజ్ ఉన్నాయి. కొత్త ప్రో మోడల్‌ లో వీడియో రికార్డింగ్ సమయంలో స్పేషియల్ ఆడియో క్యాప్చర్ వంటి ఆడియో ఫీచర్‌ కూడా ఉన్నాయి.

Next Story