ఐఫోన్ 13 సిరీస్.. అతి త్వరలో..
iPhone 13 Series Launch Tipped for September 14. ప్రపంచంలో అత్యంత పాపులారిటీ ఉన్న మొబైల్ ఫోన్స్ సంస్థ 'యాపిల్' ఒక కీలక ప్రకటన
By Medi Samrat Published on
27 Aug 2021 1:56 PM GMT

ప్రపంచంలో అత్యంత పాపులారిటీ ఉన్న మొబైల్ ఫోన్స్ సంస్థ 'యాపిల్' ఒక కీలక ప్రకటన చేసింది. 'ఐఫోన్13 సిరీస్' విడుదల తేదీని ప్రకటించింది. గత కొంత కాలంగా ఐఫోన్ వినియోగదారులు ఐఫోన్ 13 విడుదల కోసం ఎంతగానే ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐఫోన్ 13 సిరీస్ సెప్టెంబర్ 17 న విడుదలవుతున్నట్లు తెలుస్తోంది. చైనా సోషల్ మీడియా దిగ్గజం వైబూలో ఐఫోన్ 13 సిరీస్ విడుదలకు సంబంధించిన సమాచారం ఉంది. సెప్టెంబర్ లోనే ఐఫోన్ 13ను విడుదల చేయనున్నట్లు పలువురు టెక్ నిపుణులు చెప్పారు.
ఈ ఫోన్ తో పాటు సెప్టెంబర్ నెలలో ఆపిల్ తన సంస్థకు చెందిన మరో నాలుగు కొత్త ప్రాడక్ట్ లను విడుదల చేయనుందని కొన్ని స్క్రీన్ షాట్లు వైరల్ అవుతున్నాయి. ఐఫోన్ 13, ఐఫోన్ 13ప్రో, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్‌లను సెప్టెంబర్ నెలలో అమ్మకాలు జరపాల్సి ఉందనే ప్రచారం సాగుతోంది.సెప్టెంబర్ తరువాత ఎయిర్ పాడ్స్3 ని కూడా యాపిల్ విడుదల చేయనుంది. దీనిపై అధికారిక ప్రకటన కోసం ఇంకొన్ని రోజులు ఎదురుచూడాల్సిందే..! ఇక ధర లక్షల్లో ఉండబోతోందా.. కాస్త తగ్గుతుందా అన్నది తెలియాల్సి ఉంది.
Next Story