ఐఫోన్‌-13 సిరీస్ పై మనోళ్లు ఇలా పడ్డారేంటో..!

iPhone 13 pre-orders said to be stronger than iPhone 12. టెక్‌ దిగ్గజం యాపిల్‌ తాజాగా ఐఫోన్‌ 13 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లను ఇటీవలే ఆవిష్కరించింది.

By M.S.R  Published on  21 Sept 2021 4:52 PM IST
ఐఫోన్‌-13 సిరీస్ పై మనోళ్లు ఇలా పడ్డారేంటో..!

టెక్‌ దిగ్గజం యాపిల్‌ తాజాగా ఐఫోన్‌ 13 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లను ఇటీవలే ఆవిష్కరించింది. వీటిలో ఐఫోన్‌ 13, మినీ, ప్రో, ప్రో మ్యాక్స్‌ స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. ఐఫోన్‌ 13 గులాబీ, నీలం తదితర అయిదు రంగుల్లో లభిస్తుంది. వెనుకవైపు అధునాతన డ్యుయల్‌ కెమెరాలు, 5జీ, 6 కోర్‌ సీపీయూ, 4 కోర్‌ జీపీయూ, కొత్త ఏ15 బయోనిక్‌ చిప్‌సెట్‌ మొదలైన ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. ఐఫోన్‌ 13 డిస్‌ప్లే 6.1 అంగుళాలు, మినీ డిస్‌ప్లే 5.4 అంగుళాలుగా ఉంటుంది. ఐఫోన్‌ 12 మినీతో పోలిస్తే 13 మినీ బ్యాటరీ సామర్థ్యం 1.5 గంటలు, ఐఫోన్‌ 12తో పోలిస్తే ఐఫోన్‌ 13 బ్యాటరీ సామర్థ్యం 2.5 గంటలు ఎక్కువగా ఉంటుంది. ఐఫోన్‌ 13 మినీ రేటు 699 డాలర్ల నుంచి, ఐఫోన్‌ 13 ధర 799 డాలర్ల నుంచి ప్రారంభమవుతుంది. కొద్దిపాటి నాచ్ కలిగి ఉన్న ఈ ఫోన్లలో రియర్ కెమెరాల సెటప్‌ను సరికొత్తగా తీర్చిదిద్దింది. ఐఫోన్ 13ను 128 జీబీ, 256 జీబీ, 512 జీబీ వేరియంట్లలో విడుదల చేసింది.

భారత్‌లో ఐఫోన్‌-13 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లను సెప్టెంబర్‌ 17 నుంచి ప్రీ-బుకింగ్‌ ఆర్డర్స్‌ మొదలయ్యాయి. తాజాగా జరిగిన ఐఫోన్‌-13 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్స్‌ ప్రీ-బుకింగ్స్‌లో రికార్డు స్థాయిలో దేశవ్యాప్తంగా ఐఫోన్‌-13 స్మార్ట్‌ఫోన్లపై అభిమానుల నుంచి స్పందన వచ్చినట్లు తెలుస్తోంది. గత త్రైమాసికంలో ఐఫోన్‌-12 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్ల అమ్మకాల తరహాలో ఐఫోన్‌-13 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాలు ఉంటాయని నిపుణులు అభిప్రాయపడ్డారు. రాబోయే పండుగ సీజన్‌లో ఐఫోన్‌-12 సిరీస్‌, పాక్షికంగా ఐఫోన్‌-13, 13 ప్రో స్మార్ట్‌ఫోన్స్‌ అమ్మకాలు భారీగా ఉండనున్నాయని నిపుణులు తెలిపారు. సెప్టెంబర్ 24 నుంచి కొత్త ఐఫోన్‌ -13 స్మార్ట్‌ఫోన్స్‌ కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనున్నాయి. యాపిల్ ఐఫోన్ 13 సిరీస్ రూ. 69,900 నుంచి ప్రారంభించి ప్రో మాక్స్ రూ .1,29,900 వరకు అందుబాటులో ఉన్నాయి.

ఐఫోన్ 13, ఐఫోన్ 13 మినీలో డిస్‌ప్లే ఏరియాను పెంచేందుకు నాచ్‌ను చిన్నగానే ఏర్పాటు చేశారు. గత ఫోన్లతో పోలిస్తే 20 శాతం తక్కువగా నాచ్‌ను డిజైన్ చేశారు. ఇక ఫీచర్ల విషయానికొస్తే ఐఫోన్ 13లో 6.1 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లేను ఉపయోగించారు. దీనివల్ల బ్రైట్‌నెస్ 28 శాతం అధికంగా ఉంటుంది. ఎ15 బయోనిక్ చిప్‌సెట్ వాడారు. ఫలితంగా ప్రత్యర్థుల ఫోన్లతో పోలిస్తే ఇది 50 శాతం వేగంగా ఉంటుందని యాపిల్ పేర్కొంది. అలాగే, గ్రాఫికల్ పెర్ఫార్మెన్స్ కూడా 30 శాతం మెరుగ్గా ఉంటుందని తెలిపింది. ఇందులో 13 టచ్ ఐడీకి సపోర్ట్ చేస్తుంది. ఫేస్ ఐడీని కూడా జోడించారు. కెమెరా విషయానికొస్తే 12 ఎంపీ ప్రధాన సెన్సార్‌తో వెనకవైపు రెండు కెమెరాలు ఉపయోగించారు. ఇందులోని అల్ట్రా వైడ్ లెన్స్ 120 డిగ్రీ ఫీల్డ్ వ్యూను కలిగి ఉంటుంది. ప్రైమరీ కెమెరాలో సెన్సార్ షిఫ్ట్ స్టెబిలైజేషన్ ఉంది. అలాగే, వెనకవైపు కెమెరాలను డయాగ్నల్ (ఐమూల)గా ఏర్పాటు చేశారు. సినిమాటిక్ మోడ్‌ను కూడా జోడించారు. ఐఫోన్ 13లో మరింత పెద్ద బ్యాటరీని ఉపయోగించినట్టు యాపిల్ పేర్కొంది. ఐఫోన్‌ 13 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్‌ కెమెరా సెటప్‌ ఉంటుంది. ఇక ఐఫోన్‌ 13 సిరీస్‌తో పాటు కొత్త ఐప్యాడ్, యాపిల్‌ వాచ్‌ 7 సిరీస్‌ మొదలైన ఉత్పత్తులను కూడా యాపిల్‌ ఇటీవలే ఆవిష్కరించింది.


Next Story