ఐఫోన్-12 పై ఊహించని ఆఫర్స్..!

Iphone 12 Offers. ఐఫోన్ 13 మొబైల్ వస్తున్న సంగతి తెలిసిందే..! అతి త్వరలో ఐఫోన్ 13 వస్తున్న కారణంగా

By Medi Samrat  Published on  12 Sept 2021 3:29 PM IST
ఐఫోన్-12 పై ఊహించని ఆఫర్స్..!

ఐఫోన్ 13 మొబైల్ వస్తున్న సంగతి తెలిసిందే..! అతి త్వరలో ఐఫోన్ 13 వస్తున్న కారణంగా ఐఫోన్ 12పై భారీ ఆఫర్స్ ను భారత్ లో ప్రవేశపెట్టారు. దీంతో ఐఫోన్ ను కొనాలని అనుకున్న వాళ్లకు ఇదే మంచి తరుణం అని తెలుస్తోంది. సెప్టెంబ‌ర్ 14న ఐఫోన్ 13ను యాపిల్ లాంచ్ చేయ‌నుండడంతో ఐఫోన్ 12పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఐఫోన్ 12, 128జీబీ మోడ‌ల్ ఐఫోన్ ధ‌ర ప్ర‌స్తుతం రూ.84900 ఉండ‌గా డిస్కౌంట్‌తో రూ.71,999 కే ఫ్లిప్‌కార్ట్‌లో అందిస్తున్నారు. ఇన్‌స్టంట్ డిస్కౌంట్స్, ఎక్స్ఛేంజ్ ఆఫ‌ర్స్ కింద 15 వేల రూపాయ‌ల వ‌ర‌కు డిస్కౌంట్ ల‌భించ‌నుంది.

ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే 5 శాతం క్యాష్‌బ్యాక్ ల‌భించ‌నుంది. కొన్ని క్రెడిట్ కార్డుల ద్వారా నో కాస్ట్ ఈఎంఐ స‌దుపాయాన్ని కూడా అందిస్తున్నారు. నెలకు 12 వేల రూపాయ‌ల నో కాస్ట్ ఈఎంఐ ఆప్ష‌న్ ద్వారా కూడా ఈ ఫోన్‌ను కొనుగోలు చేయొచ్చు. 64 జీబీ మోడ‌ల్ ఫోన్ ధ‌ర రూ.79,900 ఉండ‌గా… ప్ర‌స్తుతం రూ.66,999 కే అందిస్తున్నారు. 256 జీబీ వేరియంట్ ధ‌ర‌ను రూ.94,900 నుంచి రూ.81,999 కే అందిస్తున్నారు.

ఐఫోన్ 12లో 6.1 ఇంచ్ ఓఎల్ఈడీ స్క్రీన్, 12 ఎంపీ రేర్ కెమెరా(4కే వీడియో స‌పోర్ట్‌), 12 ఎంపీ ఫ్రంట్ కెమెరా, ఏ14 బ‌యోనిక్ చిప్‌సెట్ 5జీ మోడెమ్‌, మాగ్‌సేఫ్ వైర్‌లెస్ చార్జింగ్ స‌పోర్ట్‌, యూఎస్‌బీ టైప్ సీ పోర్ట్ లాంటి ఫీచ‌ర్లు ఉన్నాయి. ఐఫోన్ 12 మినీ మీద కూడా భారీ డిస్కౌంట్‌ను యాపిల్ అందిస్తోంది. ఐఫోన్ 12 ఐదు క‌ల‌ర్ల‌లో ప్ర‌స్తుతం ల‌భిస్తోంది. బ్లాక్, బ్లూ, గ్రీన్, రెడ్, ఎల్లో. అద్భుతమైన కెమెరా ఈ మొబైల్ సొంతమని రివ్యూ రైటర్లు ఇప్పటికే చెప్పేశారు.


Next Story