గెలాక్సీ ఏ16 5జి విడుదల.. ధర ఎంతంటే..
భారతదేశంలో అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అయిన సామ్‌సంగ్ , ఈరోజు భారతదేశంలో గెలాక్సీ ఏ16 5జిని విడుదల చేసినట్లు వెల్లడించింది
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 19 Oct 2024 10:15 AM GMTభారతదేశంలో అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అయిన సామ్‌సంగ్ , ఈరోజు భారతదేశంలో గెలాక్సీ ఏ16 5జిని విడుదల చేసినట్లు వెల్లడించింది , దీని ప్రారంభ ధర రూ.18999.
సరసమైన ధరలో వినియోగదారులకు అద్భుతమైన ఆవిష్కరణలను అందజేస్తూ, 6 తరాల ఓఎస్ అప్‌గ్రేడ్‌లు మరియు 6 సంవత్సరాల భద్రతా నవీకరణలను అందించడం ద్వారా మధ్య-శ్రేణి స్మార్ట్‌ఫోన్‌ల కోసం భారతదేశంలో కొత్త ప్రమాణాన్ని గెలాక్సీ ఏ16 5జి నిర్దేశించనుంది.
సామ్‌సంగ్ గెలాక్సీ ఏ16 5జి రెండు వేరియంట్‌లలో లభిస్తుంది - 8 జిబి /128 జిబి మరియు 8 జిబి /256 జిబి. ఇవి గోల్డ్, లైట్ గ్రీన్ మరియు బ్లూ బ్లాక్ వంటి అధునాతన రంగులలో, ఈ రోజు నుండి రిటైల్ స్టోర్‌లు, Samsung.com మరియు Amazon.in మరియు Flipkart.comతో సహా ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉంటుంది.
అద్భుతమైన డిజైన్ మరియు పనితీరు
సొగసైన మరియు ఆచరణాత్మకమైన స్మార్ట్ ఫోన్ గా సామ్‌సంగ్ గెలాక్సీ ఏ16 5జి రూపొందించబడింది. ఈ పరికరం కేవలం 7.9 మిమీ వెడల్పు తో ఉంటుంది, ఇది ఇప్పటివరకు వున్న అతి సన్నటి మిడ్-రేంజ్ గెలాక్సీ ఏ సిరీస్ స్మార్ట్‌ఫోన్. ఐకానిక్ 'కీ ఐలాండ్' సౌందర్యం, మెరుగైన గ్లాస్టిక్ బ్యాక్ మరియు సన్నని బెజెల్స్‌తో జత చేయబడింది, ఇది చూడటానికి అద్భుతమైనదిగా ఉంటుంది. దాని అద్భుతమైన డిజైన్‌కు మించి, గెలాక్సీ ఏ16 5జి పెద్దదైన 5000ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది, ప్రయాణంలో ఉన్న వినియోగదారులకు దీర్ఘకాలిక శక్తిని అందిస్తుంది. అప్‌గ్రేడ్ చేయబడిన మీడియా టెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ ను ఇది కలిగి వుంది, ఇది హైపర్-ఫాస్ట్ కనెక్టివిటీ మరియు సౌకర్యవంతమైన మల్టీ టాస్కింగ్‌ను అందిస్తుంది, మీరు గేమింగ్ చేసినా, స్ట్రీమింగ్ చేసినా లేదా అప్లికేషన్‌ల మధ్య మారుతున్నా మృదువైన మరియు లాగ్-ఫ్రీ అనుభవాన్ని ఇది అందిస్తుంది.
అద్భుతమైన కెమెరా మరియు డిస్ ప్లే
ఈ ఉపకరణం శక్తివంతమైన మరియు వైవిధ్యమైన ట్రిపుల్ కెమెరా వ్యవస్థను కలిగి ఉంది, ఇందులో 50 ఎంపి వైడ్ , 5 ఎంపి అల్ట్రా-వైడ్ మరియు 2 ఎంపి మాక్రో లెన్స్ ఉన్నాయి. అల్ట్రా-వైడ్ లెన్స్ ప్రత్యేకంగా ఉత్కంఠభరితమైన ప్రకృతి దృశ్యాలు మరియు విశాలమైన షాట్‌లను ఒడిసిపట్టటానికి రూపొందించబడింది, వినియోగదారులు ప్రతి ఫ్రేమ్‌లో తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరింతగా ఒడిసిపట్టటం ద్వారా తమ సృజనాత్మకతను ప్రదర్శించడానికి అనుమతిస్తుంది. దీనికి అనుబంధంగా శక్తివంతమైన సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, పెద్ద 6.7 ”పూర్తి హెచ్ డి + స్క్రీన్‌తో అసలైన రంగులు, వేగవంతమైన కదలిక ప్రతిస్పందన మరియు 1 మిలియన్:1 కాంట్రాస్ట్ రేషియో; లీనమయ్యే కంటెంట్ వీక్షణ మరియు స్ట్రీమింగ్ కోసం దీన్ని ఆదర్శంగా మారుస్తుంది.
నమ్మకం మరియు విశ్వసనీయత
విశ్వసనీయతను సామ్‌సంగ్ గెలాక్సీ ఏ16 5జి పునర్నిర్వచిస్తోంది, ఆకట్టుకునే 6 తరాల ఓఎస్ అప్‌గ్రేడ్‌లు మరియు 6 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందిస్తోంది, ఇది మిడ్-రేంజ్ మార్కెట్‌లో ప్రత్యేకించి , ఫ్లాగ్‌షిప్ ఫీచర్లను ప్రజాస్వామీకరించాలనే మా నిబద్ధత ప్రదర్శిస్తుంది. ఈ పరిశ్రమలో అగ్రగామిగా ఉన్న అప్‌గ్రేడ్‌లు పరికరాన్ని ఎల్లప్పుడూ తాజాగా ఉంచడానికి మరియు వినియోగదారులకు సుదీర్ఘ కాలం పాటు సున్నితమైన వినియోగ అనుభవాలను అందించడానికి సెట్ చేయబడ్డాయి. దాని ఓర్పును హైలైట్ చేస్తూ, పరికరం నీరు మరియు ధూళి నిరోధకత కోసం ఐపి 54 రేటింగ్‌ను కలిగి ఉంది, ఇది రోజువారీ సవాళ్లను తట్టుకునేలా చేస్తుంది. ఈ మన్నికను సంపూరం చేస్తూవు సామ్‌సంగ్ యొక్క నాక్స్ వాల్ట్ చిప్‌సెట్, సాఫ్ట్‌వేర్ మరియు హార్డ్‌వేర్ ముప్పు ల నుండి రక్షణ కోసం ప్రత్యేక ట్యాంపర్-రెసిస్టెంట్ స్టోరేజ్‌లో PINలు, పాస్‌వర్డ్‌లు మరియు నమూనాల వంటి సున్నితమైన డేటాను భద్రపరచడానికి రూపొందించబడింది, వినియోగదారులకు మనశ్శాంతిని అందిస్తుంది. గెలాక్సీ ఏ16 5జి ఈ విధంగా బలమైన భద్రత మరియు దీర్ఘకాలిక మద్దతును మిళితం చేస్తుంది, స్మార్ట్‌ఫోన్‌లలో విశ్వసనీయత కోసం కొత్త ప్రమాణాన్ని నిర్దేసిస్తుంది.
అద్భుతమైన గెలాక్సీ అనుభవాలు
గెలాక్సీ ఏ16 5జి సామ్‌సంగ్ వాలెట్ ను పరిచయం చేసింది, ఇది NFC (నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్) ద్వారా విలక్షణమైన 'ట్యాప్ & పే' సామర్థ్యాన్ని కలిగి ఉంది - ఈ ధర విభాగంలోని ఇతర పరికరాల నుండి ఇది ఈ ఫోన్ ను వేరుగా నిలుపుతుంది. ఈ ప్రత్యేక సౌలభ్యం, చెల్లింపు సౌలభ్యాన్ని పెంచుతుంది, వినియోగదారులు సజావుగా మరియు సమర్ధవంతంగా లావాదేవీలు చేయడానికి అనుమతిస్తుంది. అదనంగా, పరికరం వాయిస్ ఫోకస్‌ను కలిగి ఉంటుంది, ఇది భారతీయ వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి చేయబడింది, ఇది రణగొణ ధ్వనుల వాతావరణంలో కూడా స్పష్టమైన కమ్యూనికేషన్‌ను అందిస్తుంది. ఈ ఆలోచనాత్మక ఆవిష్కరణల ద్వారా, సామ్‌సంగ్ అధునాతన సాంకేతికతను ప్రజాస్వామీకరిస్తోంది, ఇది సరసమైన ధర వద్ద రోజువారీ ఉపయోగం కోసం మరింత అనుకూలంగా మరియు ఆచరణాత్మకంగా చేస్తుంది.
అద్భుతమైన భద్రత & గోప్యత
గెలాక్సీ ఏ16 5జి అధునాతన నాక్స్ సెక్యూరిటీ ప్లాట్‌ఫారమ్‌తో భద్రత మరియు గోప్యతకు ప్రాధాన్యత ఇస్తుంది, ఇందులో సురక్షిత పాస్‌వర్డ్ నిర్వహణ కోసం సామ్‌సంగ్ పాస్ , వ్యక్తిగత యాప్‌లను లాక్ చేయడానికి పిన్ యాప్, సున్నితమైన రీతిలో ఫైల్‌లను భద్ర పరచడానికి సురక్షిత ఫోల్డర్ మరియు నియంత్రిత ఫైల్ షేరింగ్ కోసం ప్రైవేట్ షేర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ సమగ్ర సాధనాల సూట్ వినియోగదారులకు వారి డేటాను సురక్షితంగా నిర్వహించేందుకు, వారి మొత్తం అనుభవాన్ని మెరుగుపరుస్తుంది.
ధర మరియు ప్రారంభ ఆఫర్‌లు
గెలాక్సీ ఏ16 5జి ఆవిష్కరణ ఆఫర్‌లో భాగంగా, సామ్‌సంగ్ ఇండియా దాని ట్యాప్ & పే ఫీచర్ కోసం ప్రత్యేక ప్రమోషన్ కార్యక్రమంను నిర్వహిస్తోంది. సామ్‌సంగ్ వాలెట్ ద్వారా ఐదు ట్యాప్ & పే లావాదేవీలను పూర్తి చేసే వినియోగదారులు రూ. 500 వోచర్‌ను అందుకుంటారు. ఈ పరిమిత-కాల ఆఫర్ డిసెంబర్ 31, 2024 వరకు చెల్లుబాటులో ఉంటుంది.