ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు ఫేసుబుక్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై పర్సనల్ కంప్యూటర్‌లలో కూడా ఇన్‌స్టాగ్రామ్ యాప్‌ను వాడుకునే అవకాశాన్ని కల్పించింది. ఫొటోలు, వీడియోలను వెబ్ వెర్షన్ ద్వారా పోస్ట్ చేసే వెసులుబాటును తీసుకొచ్చింది. మొదట్లో 'ఎన్‌గాడ్జెట్'లో ఈ ఫీచర్ కనిపించేంది. అయితే ప్రస్తుతం ఈ ఫీచర్ ప్రపంచంలోని యూజర్లకు అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఈ కొత్త ఫీచర్ ద్వారా పీసీలలో ఎడిట్ చేసుకున్న ఇమేజ్‌లను, ప్రాసెస్డ్ ఫొటోలను అప్‌లోడ్ చేసుకోవచ్చు.
ఇదివరకైతే పీసీల నుంచి మొబైల్ ఫోన్‌లకు పంపించుకున్నాకే ఫొటోలను అప్‌లోడ్ చేసుకునే అవకాశం ఉండేదని అందరికి తెలిసిన విషయమే. అయితే ఈ ప్రాసెస్ కొంచెం కష్టంగా ఉండడంతో.. కొత్త ఫీచర్‌ను ఇన్‌స్టా అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటి వరకు ఫోన్ యాప్‌గా ఇన్‌స్టాగ్రామ్ ఉండేది. ఈ కొత్త ఫీచర్‌తో రావడంతో కంప్యూటర్‌లు వాడేవారికి ఇన్‌స్టా మరింత సులభం కానుంది. దీంతో యూజర్ల సంఖ్య మరింత పెరగొచ్చని ఫేస్‌బుక్ భావిస్తోంది.