కేంద్రం కీలక నిర్ణయం.. గోధుమల ఎగుమతులపై నిషేదం
India prohibits wheat exports with immediate effect to curb rising prices.దేశంలో రోజురోజుకి గోధుమల ధరలు పెరిగిపోతున్న
By తోట వంశీ కుమార్ Published on 14 May 2022 12:03 PM IST
దేశంలో రోజురోజుకి గోధుమల ధరలు పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గోధుమ ఎగుమతులపై నిషేదం విధించింది. ఈ మేరకు శుక్రవారం రాత్రి ఉత్వర్తులు జారీచేసింది. అయితే.. లెటర్ ఆఫ్ క్రెడిట్ ఆధారంగా శుక్రవారం(మే 13) వరకు చేసుకున్న ఒప్పందాల మేరకు మాత్రం ఎగుమతులు కొనసాగుతాయని డీజీఎఫ్‌టీ( డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్) స్పష్టం చేసింది.
ఉక్రెయిన్ పై రష్యా సైనిక దాడి చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆహార కొరత ఏర్పడుతోంది. రష్యా, ఉక్రెయిన్ దేశాలు గోధుమ ఎగుమతుల్లో టాప్ ప్లేస్‌లో ఉంటాయి. యుద్దం కారణంగా రెండు దేశాల్లో గోధుమ ఎగుమతులు నిలిచిపోయాయి. దీంతో అనేక దేశాలకు గోధుల సరఫరా ఆగిపోయింది. ఫలితంగా ఈయూ దేశాల్లో ఆహార సంక్షోభం ఏర్పడుతోంది. దీంతో అంతర్జాతీయంగా కొనుగోలుదారులు మన దేశ గోధుమ ఎగుమతుల పై ఆధారపడ్డారు. దీంతో దేశీయంగా గోధుమల ధరలు పెరిగిపోయాయి.
మరో వైపు ఉత్తర, పశ్చిమ మధ్య ప్రాంతాల్లో వీస్తున్న వేడి గాలుల కారణంగా గోధమ పంట దెబ్బతిని దిగుబడి తగ్గడం కూడా మరోకారణంగా నిపుణలు అంచనా వేశారు. దీంతో దేశీయంగా సుమారు 14-20 శాతం మేర గోధుమల ధరలు పెరిగాయి. 14 ఏళ్ల గరిష్ఠానికి ధరలు చేరాయంటే పరిస్థితిని ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేసినా దేశ ఆహార భద్రత విషయంలో ఇబ్బందులు తప్పవని గుర్తించిన కేంద్రప్రభుత్వం తక్షణమే అప్రమత్తమై నిషేదం విధించింది.