‘గ్రామీణ్ మహోత్సవ్’ను ప్రారంభించిన హ్యుందాయ్ మోటర్ ఇండియా

హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (హెచ్ఎంఐఎల్ ), గ్రామీణ భారతదేశంలో తమ కార్యకలాపాలను మరింత విస్తృతం చేయాలనే లక్ష్య సాకార దిశగా తమ ప్రయాణం ప్రారంభించింది

By Medi Samrat  Published on  19 April 2024 9:15 AM GMT
‘గ్రామీణ్ మహోత్సవ్’ను ప్రారంభించిన హ్యుందాయ్ మోటర్ ఇండియా

హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (హెచ్ఎంఐఎల్ ), గ్రామీణ భారతదేశంలో తమ కార్యకలాపాలను మరింత విస్తృతం చేయాలనే లక్ష్య సాకార దిశగా తమ ప్రయాణం ప్రారంభించింది. దేశంలోని ప్రతి మూలలో ఉన్న వినియోగదారుల యొక్క విభిన్న అవసరాలను గుర్తిస్తూ, హ్యుందాయ్ మోటర్ ఇండియా "గ్రామీణ్ మహోత్సవ్"ను సగర్వంగా పరిచయం చేసింది. ఇది గ్రామీణ భారతదేశం యొక్క స్ఫూర్తిని వేడుక చేసుకునే శక్తివంతమైన కార్యక్రమం. గ్రామీణ ప్రాంత విక్రయాలు దాని మొత్తం అమ్మకాలలో 19% కంటే ఎక్కువగా ఉండటం తో , గ్రామీణ వర్గాలతో బలమైన బంధాలను పెంపొందించడానికి హెచ్ఎంఐఎల్ కట్టుబడి ఉంది.

గ్రామీణ మహోత్సవ్ కింద, హ్యుందాయ్ ఆకర్షణీయమైన రీతిలో ఉత్పత్తి ప్రదర్శనలు, ఇంటరాక్టివ్ డెమాన్స్ట్రేషన్స్ వంటి అనుసంధానిత కార్యక్రమాలు మరియు నుక్కడ్ నాటకం, లైవ్ మ్యూజిక్, జానపద నృత్యం , ప్రాంతీయ ప్రతిభా ప్రదర్శనల వంటి ఆకర్షణీయమైన కస్టమర్ అనుభవాలతో సహా విస్తృతస్థాయి కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఈ రెండు రోజుల గ్రామీణ మహోత్సవ్ కార్నివాల్ భారతదేశం అంతటా 16 ప్రదేశాలలో నిర్వహించబడుతుంది. కళాకారులు రూపొందించిన ఆకర్షణీయమైన వస్తువులు , కార్నివాల్ రైడ్‌లు, గేమింగ్ జోన్‌లు మరియు రుచికరమైన ఫుడ్ స్టాల్స్‌తో కూడిన శక్తివంతమైన మార్కెట్ ప్లేస్‌ను సైతం అందుబాటులోకి తీసుకువస్తుంది. ఈ వేడుకలకు అతీతంగా, హ్యుందాయ్‌కు గ్రామీణ మార్కెట్‌ల విస్తృత సామర్థ్యాన్ని పరిశోధించడానికి గ్రామీణ మహోత్సవ్ ఒక వేదికగానూ ఉపయోగపడుతుంది. కమ్యూనిటీలతో సన్నిహితంగా అనుసంధానించబడి ఉండటం మరియు మార్కెట్ ట్రెండ్‌లను అన్వేషించటం ద్వారా, అభివృద్ధి చెందుతున్న ఆకాంక్షలను తీర్చడమే కాకుండా, హ్యుందాయ్ కుటుంబంలోకి కొత్త కస్టమర్‌లను గుర్తించి, స్వాగతించడం కూడా హెచ్ఎంఐఎల్ లక్ష్యంగా పెట్టుకుంది.

హ్యుందాయ్ మోటర్ ఇండియా లిమిటెడ్ సిఒఒ శ్రీ తరుణ్ గార్గ్ ఈ కార్యక్రమం పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, “గ్రామీణ ప్రాంత ప్రజలతో మా బంధాన్ని పెంపొందించడానికి మా నిరంతర ప్రయత్నాలు అపూర్వ ఫలితాలను ఇస్తున్నాయి. హ్యుందాయ్ మోటర్ ఇండియా 2023 -2024 ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ మార్కెట్లలో గణనీయమైన వృద్ధిని సాధించింది. మేము గత సంవత్సరం గ్రామీణ భారతదేశంలో 1.15 లక్షల వాహనాలను విక్రయించాము, తద్వారా 2022-23 కంటే 11% వృద్ధి ని నమోదు చేసాము. మంచి రుతుపవనాలు, ఆదాయ స్థాయిలు పెరగడం మరియు మెరుగైన మౌలిక సదుపాయాలతో, గ్రామీణ మార్కెట్ల సహకారం మరింత పెరుగుతుందని మేము విశ్వసిస్తున్నాము. గ్రామీణ మార్కెట్‌లలో అవకాశాలపై మా నమ్మకం మరియు అన్ని భౌగోళిక ప్రాంతాలలో అభివృద్ధి చెందుతున్న భారతీయ వినియోగదారుల ఆకాంక్షలను తీర్చాలనే మా అంకితభావం ఈ వృద్ధికి తోడ్పాటునందిస్తుంది" అని అన్నారు.

ఆయనే మాట్లాడుతూ “హ్యుందాయ్ మోటర్ ఇండియా వద్ద , దేశం అభివృద్ధి చెందాలంటే, భారత్ మరియు ఇండియా రెండూ సమష్టిగా పురోగమించాలని మేము గట్టిగా నమ్ముతున్నాము. గ్రామీణ మహోత్సవ్ వంటి కార్యక్రమాలతో, దేశంలోని ప్రతి ప్రాంతంలోని మా కస్టమర్‌లను ప్రోత్సహించాలని, వారి అంచనాలను అందుకోవటానికి మార్కెట్ ట్రెండ్‌లను కూడా అర్థం చేసుకోవాలని మేము ఆశిస్తున్నాము. మేము నూతన ఆవిష్కరణలు చేయటం తో పాటుగా గ్రామీణ ప్రాంత వినియోగదారులతో అనుబంధాన్ని కొనసాగిస్తున్నందున, దేశం యొక్క సమగ్ర అభివృద్ధికి దోహదపడే మా సామర్థ్యంపై మాకు నమ్మకం ఉంది..." అని అన్నారు

డీలర్లు, గ్రామీణ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు, ఫైనాన్షియర్‌లు, కస్టమర్‌లు మరియు వారి కుటుంబాలతో అనుసంధానం కావటం ద్వారా, హ్యుందాయ్ మోటర్ ఇండియా బ్రాండ్ రీకాల్‌ను మెరుగుపరచడమే కాకుండా గ్రామీణ మార్కెట్‌లలో అమ్మకాలను పెంచడానికి బలమైన నెట్‌వర్క్‌ను సైతం నిర్మిస్తోంది. తొలి గ్రామీణ మహోత్సవ్ కార్యక్రమం ఏప్రిల్ 2024లో గుజరాత్‌లోని మహ్మదావద్‌లో విజయవంతంగా నిర్వహించబడింది. ఇప్పుడు మేము గ్రామీణ ప్రకృతి దృశ్యాలలో దాని పరిధిని మరియు ప్రభావాన్ని విస్తరించడానికి ఎదురుచూస్తున్నాము. గ్రామీణ మహోత్సవ్ వంటి కార్యక్రమాలతో, హ్యుందాయ్ సంబంధాలను పెంపొందించడం, మార్కెట్ డైనమిక్‌లను అర్థం చేసుకోవడం మరియు దేశ సమగ్ర అభివృద్ధికి తోడ్పాటు అందించాలనే లక్ష్యంలో స్థిరంగా ఉంది.

Next Story