అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత హైదరాబాద్ సహా ఇతర భారతీయ నగరాలు, ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు తగ్గాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,650, 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,790 తగ్గింది. తగ్గుదల తర్వాత.. 10 గ్రాముల 22 క్యారెట్ల, 24 క్యారెట్ల బంగారం ధరలు వరుసగా రూ.72,000, రూ.78,560కి చేరుకున్నాయి.
న్యూఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 72,150 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర ధర రూ.78,710 ఉంది. కోల్‌కతా లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 72,000 ఉండగా.. 24క్యారెట్ల బంగారం ధర రూ. 78,560 ఉంది. ముంబై, చెన్నైలలో కూడా 22 క్యారెట్ల బంగారం ధర రూ. 72,000 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 78,560 ఉంది. అమెరికా ఎన్నికల ఫలితాలు డాలర్ ఇండెక్స్‌ను 105కు పెంచడంతో బంగారం ధరలు తీవ్ర అస్థిరతను ఎదుర్కొన్నట్లు నిపుణులు చెబుతున్నారు.