Viral Videos : సినిమా టికెట్లకై కాదు.. iPhone-16 కోసం పోరాటం.!

ప్రముఖ టెక్ కంపెనీ యాపిల్‌కు చెందిన ఐఫోన్-16 సిరీస్ విక్రయాలు నేటి నుంచి భారత్‌లో ప్రారంభమయ్యాయి

By Medi Samrat  Published on  20 Sept 2024 10:40 AM IST
Viral Videos : సినిమా టికెట్లకై కాదు.. iPhone-16 కోసం పోరాటం.!

ప్రముఖ టెక్ కంపెనీ యాపిల్‌కు చెందిన ఐఫోన్-16 సిరీస్ విక్రయాలు నేటి నుంచి భారత్‌లో ప్రారంభమయ్యాయి. దీనిపై ప్రజల్లో అత్యుత్సాహం కనిపిస్తోంది. సేల్ ప్రారంభమైన వెంటనే ముంబైలోని యాపిల్ స్టోర్ వెలుపల పెద్ద క్యూలు కనిపించాయి. అర్ధరాత్రి నుంచే దుకాణం ముందు ప్రజలు బారులు తీరారు. దుకాణం దగ్గర లైన్లలో నిలబడేందుకు జనం పరుగులు తీశారు.

ముంబైలోని యాపిల్ స్టోర్ బయట తొక్కిసలాట లాంటి పరిస్థితి కనిపించింది. నేను 21 గంటలుxe ఇక్కడ ఉన్నాను. నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను అని స్టోర్ బయట నిలబడి ఉన్న ఓ వ్యక్తి చెప్పాడు. స్టోర్‌లోకి ప్రవేశించిన మొదటి వ్యక్తిని నేనేన‌ని సంతోషాన్ని వ్య‌క్తం చేశాడు. ఐఫోన్ 16 సిరీస్‌లో చాలా కొత్త ఫీచర్లు ఉన్నాయి. ముంబైలోని BKCలో ఉన్న స్టోర్ వెలుపల నిలబడి ఉన్న ఒక వ్యక్తి.. గతేడాది 17 గంటల పాటు క్యూలో నిలబడ్డానని పేర్కొన్నాడు.

యాపిల్ కంపెనీ AI ఫీచర్లతో కూడిన ఐఫోన్ 16 సిరీస్‌ను సెప్టెంబర్ 9న సంవత్సరంలోనే అతిపెద్ద ఈవెంట్ అయిన‌ 'ఇట్స్ గ్లోటైమ్'లో విడుదల చేసింది. ఇందులో నాలుగు కొత్త ఐఫోన్లు లాంచ్ అయ్యాయి. iPhone 16, iPhone 16 Plus, iPhone 16 Pro, iPhone 16 Pro Max ఉన్నాయి. ఆపిల్ ఈ ఈవెంట్‌కు 'యాపిల్ గ్లోటైమ్' అని పేరు పెట్టింది.


Next Story