సబ్బులు, డిటర్జెంట్ల ధరలు భారీగా తగ్గబోతున్నాయ్..!

Hindustan Unilever lowers prices of soaps and detergents. భారతదేశపు అతిపెద్ద ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (FMCG) కంపెనీలలో ఒకటైన

By Medi Samrat  Published on  8 Oct 2022 3:02 PM GMT
సబ్బులు, డిటర్జెంట్ల ధరలు భారీగా తగ్గబోతున్నాయ్..!

భారతదేశపు అతిపెద్ద ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (FMCG) కంపెనీలలో ఒకటైన హిందుస్థాన్ యూనిలీవర్ సబ్బులు, డిటర్జెంట్ల ధరలను 2-19 శాతం తగ్గించినట్లు కంపెనీ తెలిపింది. సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్, రిన్ డిటర్జెంట్ పౌడర్, లైఫ్‌బోయ్ సబ్బు, డోవ్ సోప్ వంటివి ఉత్పత్తుల ధరలు తగ్గాయి. సబ్బులు, డిటర్జెంట్ పౌడర్లకు సంబంధించిన ముడి సరకుల ధరలు తగ్గడంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ (500 మిల్లీలీటర్ల ప్యాక్ రూ. 115 నుంచి రూ. 112కి) మరియు రిన్ డిటర్జెంట్ పౌడర్ (1 కేజీ ప్యాక్ ధర రూ. 103 నుంచి రూ. 99కి) కంపెనీ తగ్గించింది. లైఫ్‌బోయ్ సబ్బు (ఒక్కొక్కటి 125 గ్రాముల నాలుగు ప్యాక్) ధర రూ. 140 నుండి రూ. 132కి తగ్గించబడింది, డవ్ సబ్బులు (50 గ్రాములు) గతంలో రూ.27తో పోలిస్తే ఇప్పుడు రూ.22కి తగ్గాయి. పలు ఉత్పత్తులకు సంబంధించి సవరించిన రేట్ల వివరాలను హల్ తమ వెబ్ సైట్ లో ఉంచింది.

బిజినెస్ స్టాండర్డ్ నివేదిక ప్రకారం ముడి పదార్థాల ధరల పెరుగుదల కారణంగా గత కొన్ని నెలలుగా చాలా ఎఫ్‌ఎంసిజి కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను పెంచిచాయని.. ఇప్పుడు ధరలను తగ్గిస్తూ ఉన్నామని తెలిపారు. ఈ నిర్ణయంతో వినియోగదారులకు ఉపశమనం కలిగించింది. గత నాలుగు త్రైమాసికాల్లో FMCG కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను 8-15 శాతం పెంచాయి. ప్రొడక్ట్‌ని బట్టి 2 నుంచి 19 శాతం మేర ధరలు తగ్గించినట్లు తెలిపింది. అధిక ద్రవ్యోల్బణం, పెరిగిన ముడిసరుకు ఖర్చుల మధ్య గత రెంవత్సరాలుగా ధరలను పెంచగా ఇప్పుడు పలు ప్రాడెక్ట్‌లపై ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.


Next Story