గూగుల్ పే.. డబ్బులను ట్రాన్స్ఫర్ చేయడానికి భారతీయులు విపరీతంగా వాడుతున్న యాప్ ఇది. ఎప్పటికప్పుడు భారతీయుల అవసరాలకు అనుగుణంగా యాప్ లో మార్పులు జరుపుతూ ఉన్నారు. తాజాగా గూగుల్ పే డిజిటల్ గిఫ్ట్ కార్డులను తీసుకుని వచ్చింది. ఇది 150 కంటే ఎక్కువ ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ బ్రాండ్ల నుండి వర్చువల్ గిఫ్ట్ కార్డులను 1500 నగరాల్లోని భారతదేశంలోని ప్రజలకు అందించనున్నట్లు తెలిపింది.
ఈ బ్రాండ్లలో ఫ్లిప్‌కార్ట్ గిఫ్ట్ కార్డ్, ఉబెర్ ఇ-గిఫ్ట్, అమెజాన్ పే గిఫ్ట్ కార్డ్ మరియు గూగుల్ ప్లే గిఫ్ట్ కోడ్ మొదలైనవి ఉన్నాయి. గూగుల్ పేలో వోహోను సెర్చ్ చేయడం ద్వారా వర్చువల్ బహుమతి కార్డును పంపవచ్చు. బిజినెస్ ట్యాబ్ లో ఉండే గిఫ్ట్ కార్డ్ స్టోర్ లోని కార్డులలో ఎంచుకోవచ్చు. ఆ తర్వాత దానిని పంపుకోవచ్చు. ఒక్కసారి కొంటే ఆ డిజిటల్ కార్డును ఈ మెయిల్ లేదా ఎస్సెమ్మెస్ ద్వారా పంపుకోచ్చు. అలా చేయడం వలన రూ.500 వరకూ క్యాష్ బ్యాక్ పొందే అవకాశం కూడా ఉంది.
భారతదేశంలోని 10 బహుమతి కార్డులలో తొమ్మిది కార్డులు ఇ-కామర్స్, కిరాణా మరియు ఫ్యాషన్ విభాగానికి చెందినవి. క్విక్ సిల్వర్.. వోహో డిజిటల్ కార్డ్ స్టోర్ ను ఆన్ చేసి ఉంచింది. బటన్ క్లిక్ చేసి డిజిటల్ గిఫ్టింగ్ విధానం ద్వారా కన్జ్యూమర్ ఎక్స్‌పీరియన్స్ మరింత బెటర్ గా పొందొచ్చని పైన్ ల్యాబ్స్ తెలిపింది. మనం ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలని అనుకున్న సమయంలో దీన్ని వాడుకోవచ్చు.