భారీగా దిగివచ్చిన బంగారం, వెండి ధరలు
Gold Silver Rates Fall Down. పసిడి కొనాలనుకునే వారికి గుడ్‌న్యూస్.. దేశీయ మార్కెట్లో పసిడి ధరలు భారీగా
By Medi Samrat Published on 17 Feb 2021 7:58 PM ISTపసిడి కొనాలనుకునే వారికి గుడ్‌న్యూస్.. దేశీయ మార్కెట్లో పసిడి ధరలు భారీగా దిగి వచ్చాయి. బుధవారం ఒక్క రోజే రూ.717 తగ్గుముఖం పట్టగా, గత వారం రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. బంగారం బాటలో వెండి కూడా పయనిస్తోంది. ఫిబ్రవరి 11, 12న తగ్గిన బంగారం ధరలు తర్వాత నాలుగు రోజులు స్థిరంగా కొనసాగింది. మళ్లీ నాలుగు రోజుల తర్వాత పసిడి ధరలు నేల చూపులు చూస్తున్నాయి. బుధవారం దేశ రాజధానిలో ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,102కు చేరింది. అంతర్జాతీయంగా మార్కెట్‌లో బంగారం ధరలు దిగిరావడంతో దేశీ మార్కెట్‌లోనూ అదే ట్రేడ్ కొనసాగింది. దేశీయంగా బంగారు అభరణాలు, నాణేలు కొనుగోలు చేసేవారి సంఖ్య తగ్గడంతో పసిడి ధరలు తగ్గాయని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు వెండి కూడా అదే దారిలో వెళ్తోంది. బుధవారం వెండి ఏకంగా రూ.1.274 వరకు తగ్గడంతో ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 68,239కి చేరింది.
ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.500 తగ్గి ప్రస్తుతం రూ.43,750కు చేరుకోగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.560 తగ్గి రూ. 47,730కి చేరుకుంది. బంగారంతో పాటు వెండి కూడా తగ్గుముఖం పట్టింది. హైదరాబాద్‌లో కిలో వెండి ధరపై రూ.1,400 పడిపోగా, ప్రస్తుతం రూ.73,600లకు చేరింది. కాగా, గత బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం పసిడిపై కస్టమ్స్ సుంకం తగ్గించింది. దీంతో దేశంలో బంగారం ధరలు తగ్గుతాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
ఇక ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,070, చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,940 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 47,940 ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 45,690 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,690కి చేరింది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,730కి చేరింది.